నటితో బెడ్ షేరింగ్ ఫొటోలు నెట్ లో ప్రత్యక్షం- ఎట్టకేలకు బెంగళూరులో దొరికిన దర్శకుడు

ప్రముఖ కన్నడ నట- దర్శకుడు, నిర్మాత బీఐ హేమంత్ కుమార్‌ అరెస్ట్ అయ్యారు. లైంగిక వేధింపులు, మోసం, ప్రాణాపాయ బెదిరింపులు వంటి ఆరోపణలపై బెంగళూరు రాజాజీనగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. భారత న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సినిమా ఆఫర్ల పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ టీవీ నటి, రియాలిటీ షో విజేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.

రిచీ అనే సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడని, ఆ తర్వాత మోసం చేశాడని బాధిత టీివీ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికోసం రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా 60,000 రూపాయలను అందాయి. ఆ తర్వాత హేమంత్ షూటింగ్‌ను ఆలస్యం చేయడంతో పాటు తనపై వేధింపులకు పాల్పడ్డాడని లిఖితపూరకంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kannada Actor and Filmmaker BI Hemanth Kumar in Trouble

అశ్లీల దుస్తులు ధరించాలని, అసభ్యకరమైన సన్నివేశాలు చేయాలని ఒత్తిడి చేశాడని పోలీసులు తెలిపారు. ముంబైకి వెళ్ళినప్పుడు కూడా హేమంత్ నటిని అనుచితంగా తాకడమే కాకుండా వేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని ఒత్తిళ్లకు లొంగకపోవడంతో రౌడీలను పంపించి బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు, అనుమతి లేకుండా ఫొటోలను ఉపయోగించడాడని ఆరోపించారు.

కాగా హేమంత్ కుమార్ పై చెక్ బౌన్స్ కేసు కూడా నమోదైంది. గతంలో అతను ఇచ్చిన రెండు లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయినట్లు బాధిత నటి పేర్కొన్నారు. అలాగే తనకు తెలియకుండా, చెప్పకుండా, అనుమతి లేకుండా సెన్సార్ చేయని సన్నివేశాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడని ఆరోపించారు. దీనిపై తొలుత- బాధిత నటి ఫిల్మ్ ఛాంబర్‌ను సంప్రదించారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు మధ్యవర్తిత్వం వహించారు.

వాళ్లు నచ్చజెప్పిన తర్వాత కూడా హేమంత్ కుమార్ వేధింపులు, బెదిరింపులు కొనసాగినట్లు బాధిత నటి పేర్కొన్నారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపాడని, మత్తులో ఉన్నప్పుడు కొన్ని అసభ్యకర ఫొటోలు, వీడియోలను చిత్రీకరించాడని అన్నారు. ఆ వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించాడని ఆరోపించారు. తనతో పాటు తల్లిని బెదిరించడని, ఇంటి పైకి రౌడీలను కూడా పంపించాడని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+