బెంగళూరు బంద్ కు డేట్ ఫిక్స్, బీజేపీ మనసులో మాట కూడా అదే, దెబ్బ దెబ్బకు !
బెంగళూరు: కావేరీ జలాల (cauvery) వివాదంలో కర్ణాటక లేదా తమిళనాడు తరపున జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. దీంతో ప్రతిపక్షాలు, రైతు సంఘాల ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వివిధ కన్నడ సంఘ, సంస్థలు బెంగళూరు (bengaluru) బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా మద్దతు పలికడంతో ఇప్పుడు కథ రసవత్తరంగా మారింది. .
సెప్టెంబర్ 26వ తేదీన మంగళవారం బెంగళూరు (bengaluru) నగరంలో బంద్ చేయాలని రైతు అనుకూల సంస్థలు నిర్ణయించాయి. ఈ విషయమై మీడియా సమావేశంలో మాట్లాడిన రైతు సంఘం నాయకుడు కురుబూరు శాంత కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని అన్ని సంఘాలు బంద్‌లో పాల్గొనాలని మనవి చేశారు. ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న బెంగళూరు (bengaluru) బంద్‌కు ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు తెలపాలని మనవి చేశారు.

కర్ణాటక జల (cauvery)సంరక్షణ కమిటీ (కేజేఎస్ఎస్) కూడా సెప్టెంబర్ 26వ తేదీన మంగళవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. కావేరీ (cauvery) నీరు తమిళనాడుకు విడుదల చెయ్యడాన్ని వ్యతిరేకంగా పలు సంఘాల
మద్దతుతో బంద్‌కు (bengaluru)పిలుపునిస్తున్నట్లు కేజేఎస్‌ఎస్ తెలిపింది. నిరసనలో భాగంగా బెంగళూరు (bengaluru)టౌన్ హాల్ నుంచి మైసూరు (mysuru) బ్యాంక్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు నాయకులు తెలియజేసారు.

బెంగళూరు (bengaluru) బంద్‌కు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ఈ బంద్‌కు కన్నడిగులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. కావేరీ (cauvery)జలాల వివాదం రాజకీయాలకు అతీతమైనదని బీజేపీ పేర్కొంది. మరోవైపు బెంగళూరు (bengaluru)బంద్‌కు కర్ణాటక స్టేట్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కేఎస్‌టీవోఏ) అధ్యక్షుడు కే రాధా కృష్ణ మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో కావేరి (cauvery) నీటి సమస్య ప్రధాన ఆందోళనగా ఉన్నందున పలు సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు తెలిపాయి.












Click it and Unblock the Notifications