సీఎం శవయాత్ర, శవరాజకీయాలు, ఆ రాష్ట్రం వాహనాల మీద దాడులు, కథ క్లైమాక్స్ !
బెంగళూరు/చెన్నై: కావేరి జలాల కోసం చేస్తున్న పోరాటం ఊపందుకుంది. కేఆర్ఎస్ డ్యామ్ తో పాటు కావేరి నీరు నిల్వ ఉండే డ్యామ్ లు మొత్తం ఎండిపోతున్నా మాకు కావేరి నీరు కావాలని మొండిపట్టుపడుతున్న తమిళనాడు తీరును ఖండిస్తూ కన్నడిగులు చేస్తున్న కర్ణాటక బంద్ (Karnataka Bandh) విజయవంతం అయ్యింది.
గత మంగళవారం బెంగళురు బంద్ విజయవంతం (Karnataka Bandh)అయ్యింది. ఒకేవారంలో రెండో సారి బంద్ జరుగుతున్నా ఏమాత్రం విసుగుకోకుండా బెంగళూరు ప్రజలు బంద్ కు మద్దతు తెలుపుతున్నారు. బెంగళూరు ప్రజలు నిత్యం తాగడానికి ఉపయోగించేది కావేరీ నీరు కావడంతో కావేరి నీటి కోసం ఐటీ హబ్ ప్రజలు పోరాటం చెయ్యడానికి రంగంలోకి దిగారు.

మాకు తాగడానికి కావేరి నీళ్లు లేకుండా చేస్తున్న తమిళనాడు (tamil nadu) ప్రభుత్వం నాశనం అయిపోతుందని బెంగళూరు ప్రజలు శాపనార్తాలు పెడుతున్నారు. బెంగళూరులో నిత్యం దాదాపుగా ప్రజలు అందరూ కావేరి నీటినే తాగుతున్నారు. అలాంటి బెంగళూరు సిటీలో కావేరి నీటి సరఫరా అంతంత మాత్రమే అవుతుండటంతో తమిళనాడు (tamil nadu) తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు సిటీలో చిన్నపెద్ద అని తేడా లేకుండా బంద్ లో పాల్గొంటున్నారు. ఐదు ఏళ్ల బాలుడు కూడా రోడ్డు మీదకు వచ్చి కావేరి జాలాల విషయంలో మాకు న్యాయం జరగాలి అంటూ నినాదాలు చెయ్యడంతో కావేరి నీటి కోసం కన్నడిగుల చేస్తున్న పోరాటం (Karnataka Bandh) ఎంత వరకు వెళ్లిందే అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్బంలో తమిళనాడు (tamil nadu) తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు సిటీలోని అనేక ప్రాంతాలతో పాటు రామనగర, మండ్య, మైసూరు. చామరాజనగర, తుమకూరు. చిత్రదుర్గ తదితర జిల్లాల్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) దిష్టిబొమ్మలు తయారు చేసి తమిళనాడు సీఎం అంతిమయాత్ర అంటూ ఊరేగింపుగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
తమిళనాడు సీఎం (MK Stalin) అంతిమయాత్ర అంటూ ర్యాలీగా వెలుతున్న కన్నడ సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. తరువాత పోలీసులు అడ్డుకున్న చోటే తమిళనాడు (tamil nadu) సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) దిష్టిబొమ్మలను దహనం చేసిన కన్నడ సంఘాల కార్యకర్తలు అక్కడే స్టాలిన్ కు పిండప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు.

బెంగళూరు సిటీతో పాటు పలు జిల్లాలో ఆందోళనలు చేస్తున్న కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలె ప్రాంతంలోకి వచ్చిన తమిళనాడు (tamil nadu) రిజిస్ట్రేషన్ వాహనాల అద్దాలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ వాహనాలు కపడితే వాటి మీద కన్నడిగులు దాడులు (Karnataka Bandh) చెయ్యడం మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications