వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత మహిళా సర్పంచ్: రెచ్చిపోయిన హెచ్ఎం

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: కాన్పూర్ సమీంలోని దేహత్ గ్రామంలో మహిళా సర్పంచ్ పప్పీదేవి నివాసం ఉంటున్నారు. అదే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. మధ్యాహ్నం భోజనం నాణ్యతపై అవకతవలు జరుగుతున్నాయని మహిళా సర్పంచ్ పప్పీదేవికి ఫిర్యాదులు వెళ్లాయి.

అదే గ్రామంలోని స్కూల్ లో సంతోష్ శర్మ అనే ఆయన హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. పప్పిదేవీ స్కుల్ చేర్ లో కుర్చుని ఎందుకు నాసిరకంగా భోజనం చేస్తున్నారు అని హడ్ మాస్టర్ సంతోష్ శర్మను ప్రశ్నించారు. పిల్లలకు భోజనం సక్రమంగా వడ్డించాలని సంతోష్ శర్మను హెచ్చరించారు.

అంతే ఆయనకు కోపం వచ్చింది. సర్పంచ్ హెచ్చరికలను లెక్కచెయ్యలేదు. అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆమెను నిలదీశాడు. నాముందే నీవు కుర్చిలో కుర్చుంటావా అని మహిళా సర్పంచ్ పప్పీ దేవిని హెచ్చరించారు.

Kanpur: Chair purified after Dalit pradhan sits on it

ఎక్కువ మాట్లాడితే నిన్ను అక్కడే అంతం చేస్తానని మహిళా సర్పంచ్ ను బెదిరించారు. విషయం తెలుసుకున్న మహిళా సర్పంచ్ భర్త స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. అతని మీద హెడ్ మాస్టర్ సంతోష్ శర్మ విరుచుకుపడ్డాడు

వెంటనే మహిళా సర్పంచ్ కుర్చున్న కుర్చినీ నీటితో శుభ్రం చెయ్యాలని విద్యార్థులు, స్కూల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కుర్చీని నీటితో శుభ్రం చేసే వరకు సంతోష్ శర్మ వదిలి పెట్టలేదు. మహిళా సర్పంచ్, ఆమె భర్త జిల్లా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంతోష్ శర్మ మమ్మల్ని దారుణంగా అవమానించాడని, చంపేస్తానని బెదిరించాడని బాధితులు జిల్లాధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జిల్లాధికారులు స్థానిక తహసిల్ధారుకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Pappi Devi had visited the school in Kanpur Dehat to protest against the poor quality of midday meals served in the school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X