'రైలు ప్రమాదాలపై పాక్ కుట్ర, ఎన్ ఐ ఏ తో విచారణ జరిపించాలి'
దేశంలో జరిగిన రైలు ప్రమాదాలపై పాకిస్తాన్ కుట్ర ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
న్యూఢిల్లీ:దేశంలో జరిగిన రైలు ప్రమాదాలపై పాకిస్తాన్ కుట్ర ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
దేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకొన్ని రైలు ప్రమాదాలపై పాక్ కుట్ర కోణం ఉందనే అనుమానాన్ని రైల్వేశాఖ కూడ వ్యక్తం చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వ్యాఖ్యలు కూడ ఈ మేరకు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
2019 నవంబర్ 20వ, తేదిన కాన్పూర్ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ కుట్ర ఉందని మోడీ ఆరోపించారు. ఈ ఒక్కఘటనే కాకుండా సుమారు 40 రైలు ప్రమాద ఘటనలపై ఎన్ ఐ ఏ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశారు.

గత నవంబర్ మాసంలో కాన్పూర్ లో జరిగిన ప్రమాదంలో ఇండోర్ పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కనీసం 150 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత డిసెంబర్ మాసంలో సీల్టా ఆజ్మీర్ ఎక్స్ ప్రెస్ 15 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ఘటనలో 62 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగిన చోట ఫిఫ్ ప్లేట్లు తొలగించి ఉండడం , పట్టాలపై పెద్ద పెద్ద విడి బాగాలు పడి ఉండడం వాటి వెనుక విద్రోహశక్తుల పాత్రను అనుమానిస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.
ఇటీవలే పట్టుబడిన కాన్పూర్ ప్రమాదానికి కారకునిగా భావిస్తున్న నేపాల్ జాతీయుడు ఐసిస్ కోసం పనిచేస్తున్నాడన్న విషయం వెల్లడికావడం అనుమానాలకు మరింత పెంచుతోంది.












Click it and Unblock the Notifications