దారుణం : చిరు వ్యాపారి కాళ్లు పోగొట్టిన ఆక్రమణల తొలగింపు- పరుగెత్తి, రైలు కింద పడి..

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఓ సాధారణ వీధి కూరగాయల వ్యాపారి పాలిట శాపమైంది. ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసుల భయంతో పరుగులు తీసిన సదరు వ్యాపారి రైలు ఢీకొని రెండు కాళ్లూ కోల్పోయాడు.

యూపీలోని కాన్పూర్ లో తాజాగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇందులో స్ధానికంగా ఉంటున్న చిరు వ్యాపారుల ఇళ్లను కూడా తొలగిస్తున్నారు. అంతే కాదు కేసులు కూడా నమోదుచేస్తున్నారు. దీంతో తట్టా బుట్టా సర్దుకుని ఓ చిరు వ్యాపారి పరుగులు తీశాడు. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పరిగెత్తే సమయంలో తన సామాను ట్రాక్ పై పడిపోయింది. దీంతో ఆ సామానును తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ రైలు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. దీంతో అతను తప్పించుకోలేకపోయాడు.

kanpur veggie vendor loss both legs hit by train during police eviction drive

రైల్వే ట్రాక్ పై నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతని కాళ్లపై నుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అతను రెండు కాళ్లూ అక్కడే విరిగిపడ్డాయి. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయినా అతని రెండు కాళ్లు మాత్రం తిరిగొచ్చే పరిస్దితి లేకుండా పోయింది. కాన్పూర్ అదనపు డిసిపి వెస్ట్ లఖన్ యాదవ్ మాట్లాడుతూ, "ఇర్ఫాన్, అలియాస్ లడ్డూ, రైల్వే ట్రాక్‌కు దగ్గరగా కూరగాయలు విక్రయిస్తున్నాడని, పోలీసులు రావడంతో ఖాళీ చేయాలని హడావుడిగా పట్టాలపైకి వెళ్లాడని తెలిపారు. కాళ్లు కోల్పోయిన అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి షాదాబ్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ రాకేష్ జీటీ రోడ్డులో వీధి వ్యాపారులను వెంబడించారు. ఆటోరిక్షా నడుపుతున్న ఇర్ఫాన్ తండ్రి సలీం అహ్మద్, తన కుమారుడి రెండు కాళ్లు అక్కడికక్కడే తెగిపోయాయని తెలిపారు.. అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు. వారు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయాలనుకుంటే మరోలా చేసి ఉండొచ్చని, కానీ వారు క్రూరంగా వ్యవహరించడం వల్లే అతను కాళ్లు కోల్పోవాల్సివచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+