కెప్టెన్ విక్రమ్ బాత్రాకు సెల్యూట్:26 ఏళ్ల తర్వాత టైగర్ హిల్ పై కల్నల్ రాజేష్ అధౌ భావోద్వేగ పయనం

Kargil war:కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లకు పైగా గడిచిపోయినా, ఆ త్యాగాల పునాదులపై నిలబడిన విజయగాథలు మాత్రం మనసుల్లో పదిలంగానే ఉన్నాయి. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం శత్రువుల వెన్నులో వణుకు పుట్టించి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన టైగర్ హిల్ (పాయింట్ 5140) - 16,800 అడుగుల ఎత్తులో ఉన్న ఆ మంచు శిఖరంపై - కల్నల్ రాజేష్ డబ్ల్యూ. అధౌ (సేన మెడల్) మళ్లీ అడుగు పెట్టారు. తన ప్రాణ స్నేహితుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా అమరుడైన జూలై 7, 1999 తేదీనే, మళ్లీ జూలై 7, 2025న అదే నేలపై నిలబడి, ఆ వీరుడి త్యాగాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

గతంలోకి సాగిన భావోద్వేగ పయనం:
13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ (JAK) ప్రస్తుత కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేష్ బంధే, మరికొందరు సైనికులతో కలిసి సాగిన ఈ పయనం కల్నల్ అధౌకి కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక హృదయ విదారక అనుభూతి. 1999 యుద్ధ సమయంలో 13 JAK రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ (RMO)గా పనిచేసిన అధౌ, అప్పటికి కేవలం ఒక సంవత్సరం సర్వీస్ అనుభవంతోనే అంతులేని సవాళ్లను ఎదుర్కొన్నారు. మోతెక్కించే షెల్లింగ్‌ మధ్య గాయపడిన సైనికులను ప్రాణాలతో కాపాడే భయంకరమైన బాధ్యతను ఆయన తన భుజాలపై మోసారు. 97 మంది సైనికులకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలిపినప్పటికీ, దురదృష్టవశాత్తూ, ఆయన సంరక్షణలో 14 మంది సైనికులు అమరులయ్యారు. వీరిలో తొమ్మిది మందికి తలకు ప్రాణాంతక గాయాలవడం ఆయనకు తీరని వేదన మిగిల్చింది.

Kargil s Echo Col Rajesh Adhau s Emotional Return to Tiger Hill After 26 Years

బాత్రా చివరి మాటలు - చెరగని జ్ఞాపకాలు:
కెప్టెన్ విక్రమ్ బాత్రా అమరుడవడానికి ముందు రోజు, అంటే జూలై 6, 1999 సాయంత్రం, వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ కల్నల్ అధౌకి ఇప్పటికీ పచ్చి గాయమే. "తలనొప్పికి మందు కావాలి" అని అడిగిన బాత్రాకు, మరుసటి రోజు ఉదయం విధి ఆయన ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. ఈ పయనంపై అధౌ మాట్లాడుతూ, "అది ఒక భావోద్వేగ క్షణం.పాక్ ముష్కరుల నుంచి మన భూమిని తిరిగి దక్కించుకోవడానికి మేము అన్ని అడ్డంకులను అధిగమించి పోరాడాము" అని పంచుకున్నారు.

నివాళి - ఒక ఫోన్ కాల్ తో:
పాయింట్ 5140 శిఖరంపై అడుగు పెట్టిన వెంటనే, కల్నల్ అధౌ నేరుగా విక్రమ్ బాత్రా సోదరుడు విశాల్ బాత్రాకు ఫోన్ చేసి, ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను, తన అనుభూతిని పంచుకున్నారు. ఇది వీరుల మధ్య, వారి కుటుంబాల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని చాటింది. ప్రస్తుతం, కల్నల్ అధౌ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భాగంగా కాంగోలోని లెవెల్ 3 ఆసుపత్రికి అధిపతిగా దేశానికి, ప్రపంచానికి సేవ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+