JDS-AIMIM: మజ్లిస్ - జేడీఎస్ పొత్తు-కుమారస్వామి ఏమన్నారంటే..!
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆ రాష్ట్రంలో పొత్తులు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరు ఎలాంటి అవకాశం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనే కాంక్షతో ఆయా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)తో పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి మంగళవారం తెలిపారు.
హుబ్లీలో మాజీ సీఎం కుమార స్వామి విలేకరులతో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ మూడు నుంచి నాలుగు సీట్లు తమకు కేటాయించాలని కోరినట్లు కుమారస్వామి చెప్పారు. అయితే తాము పార్టీలో చర్చించి అనంతరం ఏ విషయం అనేది చెబుతామని కుమారస్వామి వెల్లడించారు. తాము జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు వారం రోజుల క్రితం కర్నాటక రాష్ట్ర మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ చెప్పారు. 25 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో జేడీ(ఎస్) మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తుందా లేదా అన్న అంశంపై కుమారస్వామి మాట్లాడుతూ.. కొన్ని స్థానాల్లో సంకీర్ణ భాగస్వాముల కోసం చూస్తున్నట్లు చెప్పారు. సంకీర్ణం సాకారం అవుతుందా లేదా అనేది అనిశ్చితంగా ఉందని ఆయన అన్నారు.హసన్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై వివాదం రాజుకున్న నేపథ్యంలో కుమార స్వామి స్పందిస్తూ అది చిన్న విషషమన్నారు.హసన్‌లో కుమారస్వామి అన్న రేవన్న భార్య భవానీ రేవన్న పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే కుమార స్వామి మాత్రం హసన్ మాజీ ఎమ్మెల్యే హెచ్ఎస్ ప్రకాష్ కుమారుడికి ఇవ్వాలని భావిస్తున్నారు .దీంతో వివాదం రాజుకుంది.












Click it and Unblock the Notifications