Karnataka assembly elections 2023: నేడే కర్ణాటక అంసెబ్లీ ఎన్నికల పోలింగ్..

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయ్యాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా భాజపా , కాంగ్రెస్‌, జేడీఎస్‌ పోటీ పడుతున్నాయి. 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఎన్నికల బరిలో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికాగ్నైజేషన్ అమలు చేయనున్నారు.

karnataka polling

పోలింగ్‌ బందోబస్తు కోసం 304 మంది డీవైఎస్పీలు, 991 మంది పీఐలు, 2,610 మంది పీఎస్‌ఐలు, 5,803 మంది ఏఎస్‌ఐలు, 46,421 మంది హెచ్‌సీ, పీసీలు, 27,990 మంది హోంగార్డులతో సహా మొత్తం 84 వేల119 మంది అధికారులను ఉపయోగిస్తున్నారు. కర్ణాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 30 లక్షల 85 వేల 566 మంది ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 66 లక్షల 82 వేల156 మంది పురుషులు, 2 కోట్ల 63 లక్షల 98 వేల 483 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో అని అందురు ఎదురు చూస్తున్నారు. గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి రెండోసారి అధికారంలోకి రాలేదు. కర్ణాటకలోని మొత్తం ఓటర్లలో 17 శాతం లింగాయత్ లు, 15 శాతం మంది వొక్కలిగాలు, 35 శాతం ఓబీసీలు, 18 శాతం ఎస్సి/ఎస్టీలు, 12.92 శాతం ముస్లింలు, 3 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ లింగాయత్, వొక్కలిగాలు, ఓబీసీలు కీలకం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+