53 తమిళ చానళ్లు బంద్: లాఠీ చార్జ్, కాల్పులు (ఫోటోలు)
బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఎన్నడూ లేని విధంగా కన్నడ సంఘాలు, సంస్థలు బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.
బెంగళూరు, మైసూరు, మండ్యతో సహ అనేక నగరాలు, పట్టణాల్లో జనసంచారం స్తంభించింది. తమిళనాడుకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్ ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది.

అన్నీ క్లోజ్
బెంగళూరు నగరంతో సహ మొత్తం 4,000 పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. రోడ్ల మీద చూద్దాం అంటే వాహనాలు కనపడలేదు. వాణిజ్య సముధాయాలు, స్కూళ్లు, కాలేజ్ లు, దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

టీవీ చెనళ్లు బంద్
బంద్ కు కేబుల్ ఆపరేటర్లు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. బంద్ ప్రభావంతో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో 53 తమిళ చానళ్ల ప్రసారాలు పూర్తిగా నిలిపివేశారు.

మెట్రో రైలుకు బ్రేక్
కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులతో పాటు బెంగళూరు మెట్రో రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాయంత్రం ఐదు గంటలు అయినా ఏ ఒక్క వాహనం రోడ్డు మీద కనపడలేదు.

మౌనంగా ఉండం: సిద్దరామయ్య
ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే తప్పులేదని, అయితే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

కత్తితో పొడుచుకున్న యువకుడు
బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో చోళరపాళ్యకు చెందిన ప్రభు (30) అనే యువకుడు కత్తితో పొడుచుకున్నాడు. రక్తం అయినా ఇస్తాం కాని కావేరి నీళ్లు ఇవ్వం అని నినాదాలు చేస్తూ కుప్పకూలిపోయాడు.

విషం తాగిన అన్నదాతలు
మండ్య జిల్లాలోని రైతులు కేఆర్ఎస్ డ్యాంను ముట్టడించారు. ఆ సందర్బంలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు లాఠీచార్జ్ చేశారు. గాలిలోకి కాల్పులు జరిపారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పలువురు రైతులు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు.

పోలీసుల వలయంలో కేఆర్ఎస్
కేఆర్ఎస్ డ్యాం దగ్గర సాయుధ బలగాలు మొహరించారు. రైతులు ఎప్పుడు ముట్టడిస్తారో అని పోలీసులు హడలిపోతున్నారు.

రైళ్లు అడ్డుకున్నారు
బెంగళూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేసి ధర్నా నిర్వహించారు. పలు చోట్ల రైళ్లు ఆలస్యంగా ప్రయాణించాయి.

తమిళనాడు వాహనాలు తీసుకురావద్దు
కావేరి నీటి విషయంలో ఆందోళనలు ఎక్కువ కావడంతో కొన్ని రోజులు తమిళనాడు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలు రోడ్ల మీదకు తీసుకురావద్దని పోలీసులు మనవి చేశారు.

వెనక్కి తగ్గం
కావేరి నీరు తమిళనాడుకు విడుదల చెయ్యకుండా న్యాయపోరాటం చెయ్యాలని, లేదంటే పోరాటం చెయ్యడానికి తాము వెనక్కి తగ్గమని కన్నడ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications