గోవా, తమిళనాడు పై భగ్గుమన్న కర్ణాటక (ఫోటోలు)
బెంగళూరు: తాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కన్నడిగులకు తమిళనాడు, గోవా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. శనివారం కర్ణాటకలో బంద్ సక్సస్ అయ్యింది. అన్నదాతలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గోన్నారు.
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో 90 శాతం బంద్ సక్సస్ అయ్యింది. కళస-బండూరి తాగు నీటి ప్రాజెక్ట్ నిర్మించడానికి గోవా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని, మేకదాటు రిజర్వాయర్ నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతున్నదని కన్నడ సంఘాలు మండిపడ్డాయి.
తమిళనాడు, గోవా ప్రభుత్వాల తీరుకు నిరసనగా సెప్టెంబర్ 26న కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. సుమారు 1,000 సంఘాలు మద్దతు ఇవ్వడంతో బంద్ సక్సస్ అయ్యింది. బెంగళూరు నగరంలో బీఎంటీసీ బస్సులు, కేఎస్ఆర్ టీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు.

బస్ స్టాండ్ ఖాళీ
మెజస్టిక్ తో పాటు బెంగళూరులోని అన్ని బస్ స్టాండ్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి.

తిండిలేక నానా ఇబ్బందులు
హోటల్ లు మూతపడటంతో తినడానికి తిండిలేక వేలాధి మంది నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు.

అక్కడే షెల్టర్లు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు గమ్యస్థానం చేరుకోలేక బస్ స్టాండ్ల లోనే ఉండిపోయారు.

తరలి వచ్చిన కన్నడ సంఘాలు
శనివారం ఉదయం నుంచి పలు కన్నడ సంఘాలు రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేశారు.

హోమం
టౌన్ హాల్ దగ్గర పురోహితులతో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

ర్యాలీ
కన్నడ సంఘాల నాయకులు టౌన్ హాల్ నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీ నిర్వహించారు.

ఎడ్ల బండ్లు
వాటల్ పార్టీ అధ్యక్షుడు వాటల్ నాగరాజ్ ఎడ్ల బండ్ల మీద ఊరేగింపుగా వచ్చి ర్యాలీలో పాల్గోన్నారు.

ఫ్రీడం పార్క్ లో నిరసన
టౌన్ హాల్ నుంచి ర్యాలీగా మైసూరు బ్యాంకు సర్కిల్, మెజస్టిక్, శేషాద్రిపురం సర్కిల్ మీదుగా ఫ్రీడం పార్క్ చేరుకున్నారు.

అధికారులతో సిద్దరామయ్య ప్రత్యేక సమావేశం
ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జి, రాష్ట్ర డీజీపీ ఓం ప్రకాష్ తదితరులతో అత్యవసర సమావేశం ఎర్పాటు చేసి బంద్ గురించి చర్చించారు.

సినీ అభిమానుల నిరాశ
వీకెండ్ సందర్బంగా సినిమాలు చూడటానికి సిద్దం అయిన సినీ అభిమానులు తీవ్ర నిరాశకు గురైనారు.












Click it and Unblock the Notifications