కావేరీ గొడవ, జయపై ఆగ్రహం: కర్నాటక బంద్ (పిక్చర్స్)
బెంగళూరు: కావేరీ నీటి గొడవ నేపథ్యంలో శుక్రవారం నాడు కర్నాటక బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచే రోడ్ల పైన ఎవరూ కనిపించడం లేదు. కర్నాటకకు చెందిన పలు సంస్థలు ఈ బందుకు ఇటీవల పిలుపునిచ్చారు.

బందుకు పిలుపు
తమిళనాడు - కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ నది నీటి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కర్నాటక బందుకు పిలుపునిచ్చారు.

మెజిస్టిక్‌లో బస్సులు సీజ్
కర్నాటక రాజధాని బెంగళూరులోని మెజిస్టిక్ బస్ స్టాండులో తమిళనాడుకు చెందిన బస్సులను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

తమిళనాడు వాహనాలపై రాళ్ల దాడి
తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాహనాల పైన బెంగళూరు, ఇతర కర్నాటక ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడుతున్నారు.

కర్నాటక బందుకు పిలుపు
కర్నాటకకు చెందిన పలు సంస్థలు శుక్రవారం నాడు కర్నాటక బందుకు పిలుపునిచ్చాయి. కావేరీ నదీ వివాదం నేపథ్యంలో బందుకు పిలుపునిచ్చారు.

రెండున్నర దశాబ్దాల గొడవ
కావేరీ నీటి పంపణి విషయంలో కర్ణాటక-తమిళనాడు రాష్ణ్రాల మధ్య 1990 నుంచి గొడవ జరుగుతోంది. కావేరీ నీటీని మాకు వదిలి పెట్టాలని తమిళనాడు న్యాయపోరాటం చేస్తోంది.

కావేరీ నీటి గొడవ
ముఖ్యంగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావేరీ నీటి పంపిణి విషయంలో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. 1991లో తమిళనాడుకు 205 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు తమిళనాడులో జయలలిత, కర్ణాటకలో ఎస్. బంగారప్ప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే తన ప్రాణం పోయినా సరే కావేరికి నీరు వదిలిపెట్టనని అప్పటి ముఖ్యమంత్రి బంగారప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా నీటి విడుదలతో..
ఇటీవల న్యాయస్థానం మరోసారి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల వాదనలు విన్న అనంతరం.. తమిళనాడుకు నీరు వదిలి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివాదం ముదిరింది. కర్నాటక బందుకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications