కర్ణాటక బంద్.. మరాఠీ యువకుల దాడికి నిరసనగా కన్నడ సంఘాల ఆందోళన
కర్ణాటక రాష్ట్రం మరోసారి బంద్‌కు సిద్ధమవుతోంది! మార్చి 22వ తేదీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని దాదాపు 3,000 కన్నడ అనుకూల సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా రాష్ట్రంలో అనేక రంగాలు స్తంభించిపోయే అవకాశం ఉంది. అయితే, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
బంద్ కారణం ఇదేనా?
శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. ఫిబ్రవరి 21వ తేదీన బెళగావిలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఈ బంద్‌కు దారితీసింది. సులేభావి-బాలేకూంద్రి సమీపంలో కొందరు మరాఠీ యువకులు బస్సు కండక్టర్ మహాదేవ్‌ను కొట్టారని ఆరోపణలు వచ్చాయి. కండక్టర్ ప్రయాణికుడిని కన్నడలో మాట్లాడమని కోరడంతో వివాదం మొదలైందని తెలుస్తోంది. ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీసింది.

బంద్ నాయకత్వం - మద్దతు:
కన్నడ చలువళి వటల్ పక్ష అధ్యక్షుడు వటల్ నాగరాజ్ ఈ బంద్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అనేక కన్నడ అనుకూల సంస్థలు కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రూపేష్ రాజన్న వర్గం, బెంగుళూరు ఆటో సేన, ఓలా-ఊబర్ డ్రైవర్స్ అసోసియేషన్, శివరామేగౌడ వర్గం, జయభారత్ డ్రైవర్స్ అసోసియేషన్, కర్ణాటక పీపుల్స్ ఫోరమ్, ఆదర్శ్ ఆటో యూనియన్, గూడ్స్ డ్రైవర్స్ అసోసియేషన్, గజకేసరి ఆర్మీ, డాక్టర్ రాజ్‌కుమార్ ఫ్యాన్ క్లబ్, ది బ్రేవ్ కన్నడిగాస్ ఆర్మీ, కర్ణాటక స్టేట్ లేబర్ కౌన్సిల్ వంటి ప్రముఖ సంస్థలు బంద్‌కు తమ మద్దతును తెలిపాయి.
ప్రభుత్వ, విద్యా సంస్థల స్పందన :
అయితే ఈ బంద్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు తెరిచి ఉంటాయని కర్ణాటక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (CAMS) జనరల్ సెక్రటరీ శశి కుమార్ పాఠశాలలు తెరిచి ఉంటాయని తెలిపారు. బెంగళూరుతో సహా అనేక జిల్లాల్లో పాఠశాల పరీక్షలు జరుగుతున్నందున, పాఠశాలలు బంద్‌లో పాల్గొనబోవని , సెలవు ప్రకటించబోవని స్పష్టం చేశారు. ప్రైవేట్ కళాశాలలు కూడా తెరిచే ఉంటాయి స్పష్టం చేశారు.
నిరసనలు - ర్యాలీలు:
బెంగళూరుతో సహా ప్రధాన జిల్లా కేంద్రాల్లో శనివారం ఉదయం నిరసనలు, ర్యాలీలు ప్రారంభకానున్నాయి.. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ, మహారాష్ట్ర, మరాఠీ గ్రూపులు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ఖండిస్తూ ప్రసంగాలు చేస్తారు. బెంగళూరు టౌన్ హాల్ నుండి ఇండిపెండెన్స్ పార్క్ వరకు ఉదయం 10:30 గంటలకు నిరసన ర్యాలీని నిర్వహించనున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపార సంస్థలు మూసివేయబడతాయని వటల్ నాగరాజ్ తెలిపారు.
బంద్‌కు వ్యతిరేకత:
కానీ కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎ. నారాయణ గౌడ తమ సంస్థ బంద్‌కు మద్దతు ఇవ్వదని మరియు పాల్గొనదని తెలిపారు. బెళగావిలో జరిగిన మునుపటి నిరసనలు సమస్యను పరిష్కరించాయని, కన్నడిగులు ఎదుర్కొంటున్న అన్యాయాలపై చర్య తీసుకుంటామని స్థానిక పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications