కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
కర్ణాటక ప్రజల ఆగ్రహానికి కారణమైన హుబ్బళిలోని కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య చివరికి రంగంలోకి దిగారు. గురువారం హుబ్బళిలోని నేహా నివాసానికి వెళ్లిన సీఎం సిద్దరామయ్య ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్, నేహా తండ్రి నిరంజన్ హీరేమఠ్ కుటుంబానికి సానుభూతి తెలిపిన సీఎం సిద్దరామయ్య బీజేపీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
నేహా హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. హుబ్బళిలో సీఎం సిద్ధరామయ్య హత్యకు గురైన నేహా ఇంటికి వెళ్లి ఆమె తండ్రి నిరంజన్ హిరేమఠ్, ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ నేహా హిరేమఠ్ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, నేహా హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని అన్నారు.

నేహా హత్య కేసులో జైల్లో ఉన్న ఫయాజ్ గురించి పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని సిద్దరామయ్య అన్నారు. నేహా హత్య కేసు దర్యాప్తు సీఐడీకి అప్పగించామని సిద్దరామయ్య అన్నారు. హంతకుడు ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలని. ఈ కేసులో బీజేపీ రాజకీయం చేస్తోందని, తన హయాంలో ఒక్క కేసు కూడా సీబీఐకి అప్పగించలేదని బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య అన్నారు.
నేహా హత్య కేసులో రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదని, కాంగ్రెస్ రాజకీయాలు చేయలేదని సిద్దరామయ్య అన్నారు. నేహా కుటుంబం చాలా విషాదంలో ఉందని, వారిని ఓదార్చి ధైర్యం చెబుదామని ఇక్కడికి వచ్చామని, నిరంజన్ హిరేమఠ్ కుటుంబానికి తోడుగా ఉంటామని వారికి మేము అభయం ఇచ్చామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. నేహా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, నింరంజన్ హిరేమఠ్ కుటుంబానికి తగిన రక్షణ కల్పిస్తామని, ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? తదితర కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్దరామయ్య అన్నారు.












Click it and Unblock the Notifications