అందరిని ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం, మావాళ్ల కోసం ప్రత్యేక టీమ్ తో !
బెంగళూరు/భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది, ఈ ప్రమాదంలో వందల మందికి పైగా మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో కన్నడిగులు కూడా ఉన్నారని, వారిని సురక్షితంగా తీసుకువస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
రైలు ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో వెంటనే ఘటనాస్థలికి వెళ్లి కన్నడిగుల భద్రతపై దృష్టి సారించి వారికి అవసరమైన సహాయం అందించాలని మంత్రి సంతోష్ లాడ్‌ను ఆదేశించామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఈసంఘటనలో గాయపడినా, మరేదైనా సమస్యలు ఎదుర్కొంటున్న కన్నడిగులను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

ఈ రైలులో సంచరిస్తున్న ప్రతి ఒక్క కన్నడిగుని సురక్షితంగా కర్ణాటకకు తీసుకువస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం సిద్దరామయ్య అన్నారు.
అలాగే ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ సంతాపం తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ జరిగిన రైలు ప్రమాదం చాలా బాదకలిగించిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నానని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మందికి పైగా మరణించారనే వార్త విని షాక్‌కు గురైనాని, ఇటీవలి కాలంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇదే అని, ఈ ప్రమాదంలో మరణించిన వారికి శాంతి కలగాలని కోరుకుంటున్నానని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన అని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications