దెబ్బకు లోపలేసిన సీఐడీ, టెర్మినల్ స్కామ్ కేసులో కలకలం, మాజీ ఎండీని పట్టుకుని ?
రూ. 47.10 కోట్ల కుంభకోణానికి సంబంధించి డి. దేవరాజ అరసు ట్రక్ టెర్మినల్ (డీడీయుటీటీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఎస్. శంకరప్పను కర్ణాటక సీఐడీ అరెస్టు చేసింది. డీడీయూటీఎల్ కార్పొరేషన్‌లో 2021 నుంచి 2023 మధ్య కాలంలో కాంట్రాక్టుల మంజూరులో అవకతవకలు జరిగాయని కార్పొరేషన్ ప్రస్తుత ఎండీ సీఎన్ శివప్రకాష్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసును తరువాత సీఐడీ విచారించింది. అదేవిధంగా విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు మాజీ ఎండీ శంకరప్పను అదుపులోకి తీసుకున్నారు.ప్రసుత్త స్టేట్ న్యూస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ప్రమోషన్ బ్రాంచ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న శంకరప్ప గతంలో డీడీయుటీఎల్ ఎండీగా పని చేశారు. కార్పొరేషన్ కాంట్రాక్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు విచారణలో ఆధారాలు లభించాయని సీఐడీ వర్గాలు తెలిపాయి.

2021అక్టోబర్ 25వ తేదీ డి. దేవరాజు అరసు ట్రక్ టెర్మినల్‌లో జరిగిన 194వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో, ట్రక్ టెర్మినల్స్ మరమ్మతులు మరియు నిర్వహణ కోసం రూ.10 కోట్ల వరకు పీస్‌మీల్ కాంట్రాక్టులు ఇవ్వాలని ఆమోదం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పనులు చేపట్టకుండా నకిలీ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఈ వ్యవహారం కలకలం రేపింది.
దీనిపై ఆరా తీసిన కార్పొరేషన్ ఎండీ ఆ తర్వాత బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ముక్కోణపు కాంట్రాక్టు పనుల్లో రూ. 47.10 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. ఈ కేసు క్షుణ్ణంగా విచారణ చేసిన సీఐడీ అధికారులు డీడీయుటీటీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శంకరప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్టు చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications