మోదీతో చాలెంజ్ చేస్తే అడ్రస్ లు గల్లంతు గ్యారెంటీ, సీన్ రిపీట్, సీఎం !

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఓ సింహస్వప్నం, ఆయన గురించి పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి ప్రయత్నించారని, గత లోక్ సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని పదేపదే విమర్శించడం, ఆధారాలు లేకుండా ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చివరికి ఇలాంటి గతి పట్టిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో మల్లికార్జున ఖార్గేకి చాలా గౌరవం ఉందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

 Karnataka

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆయన స్థాయి, హోదా. ఆయన పదవిని మరిచిపోయి ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్రస్ లేకుండా పోయారని, ఇప్పుడు కూడా ఆ పార్టీ నాయకులకు ఇదే గతి పడుతుందని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వారి ఆశయాలు అడియాశలు అవుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని పదేపదే విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండాపోయారని, ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేరాఫ్ అడ్రస్ చిక్కడం కష్టం అని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Karnataka

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లు తెరచి ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం మానుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికల సందర్బంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలని, కాని అందుకు ఓ హద్దు ఉంటుందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+