నేడే కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష: శివకుమార్ అసంతృప్తి
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా ఇదే రోజు జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.

కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. అయితే, బీజేపీ కూడా స్పీకర్ స్థానానికి పోటీ పెట్టే అవకాశం ఉండటంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవుల్లో ప్రాధాన్యత లభించలేదని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే బలపరీక్షకు ప్రాధాన్యాత ఏర్పడింది.












Click it and Unblock the Notifications