వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా డాన్ రవి పూజారి అరెస్టు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యండి, సీఎంకు బీజేపీ సవాల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాఫియా డాన్ రవి పూజారిని అరెస్టు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు. ఎంతో కాలంగా తప్పించుకుని విదేశాల్లో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవి పూజారిని ఎట్టకేలకు అరెస్టు చేశామని సీఎం కుమారస్వామి అన్నారు.

ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మాఫియా డాన్ రవి పూజారిని అరెస్టు చెయ్యడం కాదు, కంప్లీ కాంగ్రెస్ శాసన సభ్యుడు గణేష్ ను అరెస్టు చేసి తరువాత గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి బీజేపీ నాయకులు చురకలు అంటించారు.

 Karnataka CM Kumaraswamy told media that arresting don Ravi Pujari is our governments achievement.

కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సాటి కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనంద్ సింగ్ మీద దాడి చేశారు. జనవరి 19వ తేదీ రాత్రి ఆనంద్ సింగ్ మీద గణేష్ దాడి చేశారని బిడిది పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎమ్మెల్యే గణేష్ ను అరెస్టు చెయ్యడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మంగళూరుకు చెందిన మాఫియా డాన్ రవి పూజారి విదేశాల్లో తలదాచుకుని హఫ్తా వసూలు చేస్తూ వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ తారలను బెదిరించాడని దాదాపు 40 కేసులు నమోదు అయ్యాయి. జనవరి 21వ తేదీ సెనగల్ పోలీసులు రవి పూజారిని అరెస్టు చేశారు. బెంగళూరు ఇంటిలిజెన్స్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో సెనగల్ పోలీసులు రవి పూజారిని అరెస్టు చేశారని సమాచారం.

రవి పూజారిని అరెస్టు చెయ్యడంలో తమ ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని ముఖ్యమంత్రి కుమారస్వామి అంటున్నారు. మొదట కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ను అరెస్టు చేసి మీ ప్రతాపం చూపించాలని సీఎం కుమారస్వామికి బీజేపీ నాయకులు సవాలు విసిరారు.

English summary
Karnataka CM Kumaraswamy told media that arresting don Ravi Pujari is our governments achievement. But BJP tweets to CM and said first arrest MLA Ganesh who is absconding from 12 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X