జైల్లో శశికళ కలకలం, రిటైడ్ ఐఏఎస్ తో విచారణ, డీఐజీ రూపకు నోటీసులు: సీఎం సిద్దూ !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహర సెంట్రల్ జైల్లో జరుగుతున్న తతంగంపై రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సూచించామని కర్ణాటక .

మైసూరు/బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహర సెంట్రల్ జైల్లో జరుగుతున్న తతంగంపై రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సూచించామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

శుక్రవారం మైసూరు నగర సమీపంలోని మండకళ్ళి విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా సిద్దరామయ్య మాట్లాడుతూ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారా ? లేదా ? అనే విషయంపై విచారణ మొదలైయ్యిందని అన్నారు.

సీఎం సిద్దూ అసహనం !

సీఎం సిద్దూ అసహనం !

శశికళకు రాచమర్యాదలు చేస్తున్న విషయంలో నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడుతానని సిద్దరామయ్య అన్నారు. సెంట్రల్ జైల్లో జరుగుతున్న వ్యవహారం ఇంతకు ముందు మీ దృష్టికి రాలేదా ? అని విలేకరులు ప్రశ్నించగా సీఎం సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు.

ఆమె అలా చెయ్యాలా ?

ఆమె అలా చెయ్యాలా ?

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు విషయం ఇంతకు ముందే నా దృష్టికి వచ్చి ఉంటే తాను ఎందుకు చర్యలు తీసుకోను అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఇదే సమయంలో సీనియర్ పోలీసు అధికారి జైళ్ల డీఐజీ రూప విషయంలో సీఎం సిద్దరామయ్య స్పందించారు. డీఐజీ రూప పై అధికారులతో పూర్తిగా చర్చించాలని గుర్తు చేశారు.

Recommended Video

    Sasikala Corruption Case : IPS officer who exposed AIADMK leader's life in jail | Oneindia News
    పదేపదే మీడియాతో ఎందుకు ?

    పదేపదే మీడియాతో ఎందుకు ?

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అవ్యవహారం విషయాన్ని ప్రభుత్వం, పై అధికారుల దృష్టికి తీసుకు వచ్చి చర్చించిన తరువాత మీడియాతో మాట్లాడాలని సీఎం సిద్దరాయ్య అన్నారు. అంతే కాని డీఐజీ రూప పదేపదే మీడియాతో మాట్లాడటం మంచి పద్దతి కాదని సీఎం సిద్దరామయ్య అన్నారు.

    డీఐజీ రూపకు నోటీసులు

    డీఐజీ రూపకు నోటీసులు

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అవ్యవహారం విషయంలో పై అధికారులకు నివేదిక ఇవ్వాలి తప్పా ప్రభుత్వ అధికారులు మీడియాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని డీఐజీ రూపకు నోటీసులు జారీ చేస్తామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

    దేశ వ్యాప్తంగా మళ్లీ చిన్నమ్మ రచ్చ రచ్చ

    దేశ వ్యాప్తంగా మళ్లీ చిన్నమ్మ రచ్చ రచ్చ

    అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ ఇప్పుడు మరో సారి దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి జైళ్ల శాఖ అధికారులకు శశికళ రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+