సుమలత ఎలా గెలిచారో అందరికి తెలుసు, ఈ సారి మాత్రం సినిమా చూపిస్తాం, సీఎం చాలెంజ్
తెలుగింటి ఆడపడుచు, శ్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, బహుబాష నటి, మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ పై కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమలత గతసారి కాంగ్రెస్ ఓట్లతో లోక్ సభ ఎన్నికల్లో గెలిచారని, ఈసారి సుమలతతో పాటు మాజీ సీఎం హెచ్ డీ, కుమారస్వామి, అపవిత్ర కూటమి అభ్యర్థిని ఓడించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కర్ణాటకలోని మండ్య జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ తరుపన మండ్య యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఉచిత హామీ పథకం లబ్ధిదారుల సమావేశంలో సీఎం సిద్దరామయ్య పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప ఏడు కేజీల ఉచిత బియ్యాన్ని ఐదు కేజీలకు తగ్గించారని, ఆ సందర్బంలో మేము ప్రశ్నించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని, అలాంటి వారిని గెలిపించాలా అని సీఎం సిద్దరామయ్య మండ్య జిల్లా ఓటర్లను ప్రశ్నించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయినా, లోక్‌సభ ఎన్నికలు అయినా మండ్య ప్రజలు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారని, కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని, ఒక నియోజక వర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిందని, కర్ణాటక రాష్ట్ర ప్రజలు అంచనాలకు మించి ఆశీర్వదించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 135 సీట్లలో గెలిపించారని సీఎం సిద్దరామయ్య అన్నారు.
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారని, ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి రాగలిగామని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో అంబరీష్ సతీమణి సుమలత కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతో ఎంపీగా విజయం సాధించారని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మండ్యలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా విజయం సాధిస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా మండ్య లోక్ సభ సీటు జేడీఎస్ కు ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే అదే మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన సుమలత చివరికి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరోక్షంగా బీజేపీ మద్దతుతో నిఖిల్ కుమారస్వామిని ఓడించి ఆమె ఎంపీగా విజయం సాధించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications