తొక్కిసలాటతో మాకు సంబంధం లేదు: సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టైటిల్ గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో స్టేడియం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు తొలుత రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కానీ ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా ఆ పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచుతూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు ఆర్సీబీ సంస్థ సైతం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఇక తాజాగా తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు ఆహ్వానించిందని అందుకే ఆ విజయోత్సవ ర్యాలీకి వెళ్లానని అన్నారు. అంతకుమించి అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని.. అంతమంది అభిమానులు వస్తారని.. తొక్కిసలాట జరుగుతుందని తమకు సమాచారం లేదని అన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు.

Karnataka CM Siddaramaiah Denies Government Role in Stampede Incident

" కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు సెక్రటరీ, మెంబర్స్ నా వద్దకు వచ్చి విజయోత్సవ ర్యాలీకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి స్థానంలో వారి ఆహ్వానాన్ని మన్నించి నేను వెళ్లాను. గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని క్రికెట్ బోర్డు సభ్యులు తెలిపారు. అందుకే వెళ్లాను. అయితే వాళ్లు నన్ను స్టేడియంకు మాత్రం ఆహ్వానించలేదు" అని సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు రాష్ట్రంలోని అనేకమంది వీఐపీలను పిలిచింది. దీంతో పోలీసులు అంతా సెపరేట్ అయిపోయి వాళ్లకు బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో సాధారణ అభిమానుల మధ్య పోలీసులు లేరు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో 11 మంది మృతిచెందారు. మరో 47 మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+