కర్ణాటక బడ్జెట్ రూ. 2,09,181 కోట్లు, మైనారిటీలకు పండగ, ఐటీకి నాలుగు మెతుకులు !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం బెంగళూరులోని విధాన సౌధలో 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం సిద్దరామయ్య ఎవ్వరూ ఊహించని రీతిలో రూ. 2. 09.181 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ, వ్యవసాయం, మైనారీలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, వైద్యం, మహిళ, శిశు సంక్షేమ రంగాలకు ప్రధాన్యత ఇచ్చారు. అయితే ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐటీ రంగానికి మాత్రం సిద్దరామయ్య ప్రభుత్వం నాలుగు మొతుకులు విదిల్చింది.

ఎన్నికల ఎఫెక్ట్

ఎన్నికల ఎఫెక్ట్

సీఎం సిద్దరామయ్య శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ సిద్దం చేసి ప్రవేశపెట్టారు. నీటిపారుదల శాఖకు రూ. 18, 112 కోట్లు, రైతుల ప్రయోజనాలు కలిగించే పథకాలకు రూ. 5,080 కోట్ల ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఈ రెండు శాఖలకే అధిక ప్రధాన్యం ఇస్తూ సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఎస్సీ అమ్మాయిలు

ఎస్సీ అమ్మాయిలు

ఎస్సీ యువకులు వేరే కులం యువతిని పెళ్లి చేసుకుంటే రూ. 3 లక్షలు, ఎస్పీ అమ్మాయి వేరే కులం అబ్బాయిని వివాహం చేసుకుంటే రూ. 5 లక్షల ప్రోత్సాహకదనం ఇస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. బీఎడ్, డీఎడ్ ,మైనారిటీ విద్యార్ధులకు రూ. 25 వేలు ప్రోత్సహకదనం ఇస్తామని సీఎం సిద్దూ వివరించారు.

బెంగళూరుకు ప్యాకేజ్

బెంగళూరుకు ప్యాకేజ్

బెంగళూరు అభివృద్దికి రూ. 2,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. బెంగళూరు మెడికల్ కాలేజ్ లో 1,000 పడకల ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించారు. విద్యార్థుల భద్రత దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యడానికి నిధులు కేటాయించారు.

 రైతుల రుణాలు

రైతుల రుణాలు

కో ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఇప్పటికే మరణించిన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు. మహిళలు, మత్సకారులకు ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 50 వేలు రుణం ఇస్తామని, ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు.

5 లక్షల ఇళ్లు

5 లక్షల ఇళ్లు

గ్రామీణ ప్రదేశాల్లో ప్రభుత్వం ఐదేళ్లలో 5 లక్షల ఇళ్లు నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. బెంగళూరు-మదనపల్లి (ఆంధ్రప్రదేశ్) రహదారిలో అభివృద్ది పనులకు రూ. 267 కోట్లు కేటాయించారు. మైసూరు, హాసన్, కారవార ప్రాంతాల్లోని మెడికల్ కాలేజ్ లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు.

 బెంగళూరు ట్రాఫిక్, జైళ్లు

బెంగళూరు ట్రాఫిక్, జైళ్లు

బెంగళూరులో ట్రాఫిక్ నియంత్రించడానికి రూ. 1, 017 కోట్లు, జైళ్ల శాఖ భద్రతకు రూ. 100 కోట్లు, రూ. 5 కోట్ల వ్యయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ రూ. 5 కోట్ల వ్యయంతో పోలీసు స్మారకభవనం, రూ. 5 కోట్ల వ్యయంతో పాత్రికేయులకు ప్రత్యేక భవనం నిర్మిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

 ఐటీకి నాలుగు మెతుకులు

ఐటీకి నాలుగు మెతుకులు

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, బీటీ రంగాల్లో బెంగళూరుకు ప్రత్యేక స్థానం ఉంది. సీఎం సిద్దరామయ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఐటీ శాఖ అభివృద్ది కోసం రూ. 247 కోట్లు మాత్రమే కేటాయించిన సీఎం సిద్దరామయ్య అందరికీ షాక్ ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 5,321 కోట్లు కేటాయించారు.

తిరుమలకు !

తిరుమలకు !

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో రూ. 20 కోట్ల వ్యయంతో వసతి గృహాలు నిర్మించడానికి నిధులు కేటాయించారు. అదే మైనారీలు అయిన ముస్లీంల సక్షేమ పథకాలకు సుమారు రూ. 2, 000 కోట్లు, క్రైస్తవుల సక్షేమ పథకాల కోసం రూ. 200 కోట్లకు పైగా సిద్దరామయ్య ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

తాగినోడికి తాగినంత

తాగినోడికి తాగినంత

కర్ణాటకలో మద్యం విక్రయాలపై 8 శాతం పన్ను పెచ్చిన సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం 2018-17 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 18,750 కోట్ల ఆదాయాన్ని ఆశీస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి రూ. 10,400 కోట్ల ఆదాయాన్ని ఆశీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+