ఎంపీ సింహా పెద్ద ముఠాల్, పనికిమాలినోడు, సీఎం గురించి మాట్లాడితే ?, అంతు చూస్తాము !
శ్రీరాముడు హిందువుల ఆరాధ్యదైవం. నేను కూడా శ్రీరాముని భక్తుడినే, శ్రీరాముడిని మేము కూడా పూజిస్తాం, మేము అల్లా, యేసుప్రభువును గౌరవిస్తామని, బీజేపీ నాయులు లాగా మతాల మధ్య చిచ్చులు పెట్టే లాంటి పనులు మేము చెయ్యమని, కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తోందని, అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ హాజరుకారని కర్ణాటకలోని చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ అన్నారు.
చిక్కబళ్లాపూరంలో మీడియాతో మాట్లాడిన ఆ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ శ్రీరామచంద్రుడు బీజేపీకి అప్ప ఆస్తి కాదని అన్నారు. మేము కూడా హిందువులం, శ్రీరామచంద్రుడు మా ఆరాధ్య దైవం, మా పార్టీలో కూడా రాముడి భక్తులు ఉన్నారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ మండిపడ్డారు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై విరుచుకుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పెద్ద ముఠాల్ అని, అతను ఓ పెద్ద పనికిమాలినోడు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, ప్రజాసేవ చెయ్యడంలో సుమారు 40 నుంచి 50 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం సిద్దరామయ్యను బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ హెచ్చరించారు.

సిద్ధరామయ్యపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము సహించమని ప్రదీప్ ఈశ్వర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను హెచ్చరించారు. ప్రతాప్ సింహా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లోక్ సభలోకి వెళ్లడానికి ఎవరికంటే వాళ్లకు విజిటర్ పాస్ లు ఇచ్చిన మీరు దేశద్రోహులని, అదే మేము లోక్ సభ ఎంట్రీ పాస్ లు ఇచ్చి ఉంటే మమ్మల్ని మీరు ఊరికే వదలేస్తారా ? అని ప్రతాప్ సింహాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ఓముఠాల్, పనికిమాలినోడు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడటం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications