Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ గురించి స్టేజ్ మీద ఏం మాట్లాడంటే ? కోర్టులో బెయిల్ తీసుకున్న లీడర్ !

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ మీటింగ్ లో దూషించి ఇటీవల వార్తల్లో నిలిచిన కర్ణాటక కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఉపాధ్యక్షుడు జీఎస్ మంజునాథ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజునాథ్ మీద కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు ఇదే కేసులో మంజునాథ్ కు బెయిల్ మంజూరు అయ్యింది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూరు నగరంలోని హరిశ్చంద్ర ఘాట్ సమీపంలో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన తరువాత వేదికపై ప్రసంగించిన సందర్భంగా జీఎస్ మంజునాథ్ ప్రధాని నరేంద్ర మోదీని ఏకవచనంతో కించపరిచే విదంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై మంజునాథ్ పై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Karnataka court grants bail to man who insulted PM Narendra Modi

బీజేపీ నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజునాథ్ మీద చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చి 20వ తేదీన బుధవారం జీఎస్ మంజునాథ్ జేఎంఎఫ్‌సీ కోర్టుకు హాజరయ్యారు. జీఎస్ మంజునాథ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చిన అనంతరం జీఎస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా ఏకవచనంతో మాట్లాడటం నేరమన్నారు. కానీ నా స్పీచ్‌లో నేను ఏకవచనంతో ప్రధాని మోదీని ఎక్కడా దూషించలేదని అన్నారు.

నేను మాట్లాడిన వీడియోను కొందరు కట్ చేసి కట్ చేసి చూపించారని, తాను ప్రధాని నరేంద్ర మోదీని దూషించానని తన మీద కేసు పెట్టారని, తాను ఇప్పుడు కోర్టుకు హాజరై బెయిల్ తీసుకున్నానని మంజునాథ్ చెప్పారు. నా ప్రసంగం మొత్తాన్ని ఎవరూ ఎక్కడా చూపించలేదని, ఏ ప్రభుత్వమైనా ప్రజలు ప్రశ్నించాలని చెప్పానని, మనమందరం ఈ దుష్టవ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడాలని నా వాదన అని మంజునాథ్ అన్నారు.

Karnataka court grants bail to man who insulted PM Narendra Modi

నువ్వే ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడలేదని, తాను న్యాయపోరాటం చెయ్యడానికి కోర్టు ఉందని, విచారణ చెయ్యడానికి అధికారులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజునాథ్ మీడియాకు చెప్పారు. 2014లో గ్యాస్ సిలెండర్ ధర రూ. 450 ఉందని, అదే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,150 అయ్యిందని, లోక్ సభ ఎన్నికలు రాగానే గ్యాస్ సిలిండర్ మీద రూ. 100 రూపాయలు తగ్గించడంతో ప్రజలు నవ్వుకోవాల్సి వచ్చిందని మంజునాథ్ వ్యంగంగా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+