తెలంగాణ మీడియాలోనే ఎందుకు ఇచ్చామంటే ?, పక్కరాష్ట్రం డీసీఎం పక్కాక్లారిటీ, సార్ !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్రంలోని దినపత్రికల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విడుదల చేసిన ప్రకటనల్లో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు కర్ణాటక ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.
తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోటింగ్ జరగనుంది. తెలంగాణ మీడియాలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని ప్రకటనలు ప్రచురించింది. ఆ ప్రకటనల్లో కర్ణాటకలోని తమ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టం నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సోమవారం ఈ విషయంపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

అదే రోజు ఎన్నికల సంఘం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ వార్తాపత్రికలలో మీ ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించకూడదని, వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ప్రకారం ముందస్తు అనుమతి పొందకపోవడంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం గురించి మంగళవారం బెంగళూరులో డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు.

కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం తమ ఉచిత హామీ పథకాలు ఏవేవి అమలు చేసింది అని వివరిస్తూ తెలంగాణ మీడియాలో ప్రకటనలు ఇచ్చిందని అన్నారు. ఉచిత హామీలు మేము అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీల వాదనలకు కర్ణాటక ప్రభుత్వం సమాధానం ఇస్తూ ప్రకటనలు ఇచ్చిందని డీకే శివకుమార్ అన్నారు.

అయితే కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మేం ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు, కర్ణాటక ప్రభుత్వం ఎవరికీ ఓటు వేయమని తెలంగాణ పత్రికలకు ఇచ్చిన ప్రటనల్లో అడగలేదని, మేము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఎన్నికల సంఘం ఆదేశాలపై వారు అడిగిన ప్రశ్నకు బదులిస్తామని డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటక ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలపై స్పందిస్తూ తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ఓట్ల కోసం ప్రచారం చేయలేదని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో హామీ పథకాలు అమలు కాలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాము బదులిస్తూ కర్ణాటకలో ఉచితహామీల పథకాలు అన్ని అమలు చేస్తున్నామని తెలంగాణ పత్రికల్లో తాము ప్రకటనలు ఇచ్చామని, తెలంగాణ ప్రజలను కర్ణాటక ప్రభుత్వం ఓట్లు అడగలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు మామీద లేనిపోని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశాయని, మేం ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, కర్ణాటక ప్రభుత్వం ప్రకటనల ద్వారా ఎవ్వరిని ఓట్లు అడగలేదని, కాంగ్రెస్ పార్టీకి కాని, మరే వ్యక్తులకు ఓట్లు వెయ్యాలని మేం చెప్పలేదని డీకే శివకుమార్ వివరించారు. మేము కర్ణాటక ప్రభుత్వ పనితీరును ప్రకటనల ద్వారా అందరికి చెప్పామని, ఎలాంటి నియమాలు తాము ఉల్లంఘించలేదని డీకే శివకుమార్ అన్నారు. మేము ఎన్నికల కమిషన్‌కు ఖచ్చితంగా సమాధానం ఇస్తామని డీకే శివకుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications