ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం చేసిన తరువాత చెబుతా, మిమ్మల్ని ఎవరైనా కట్టేశారా ?, డీకే ఫైర్ !
కర్ణాటకలోని హాసన్ లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ, మరోసారి అదే నియోజక వర్గం నుంచి బీజేపీ-జేడీఎస్ కూటమి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ కేసు రోజురోజుకు వివాదాలకు కేంద్ర బింధువు అవుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ పార్టీ కుటంబానికి చెందిన వాడు కావడం, సిట్టింగ్ ఎంపీ కావడం, మరోసారి ఎంపీగా పోటీ చెయ్యడంతో ఆయన కేసు ప్రతిరోజు హాట్ టాపిక్ అవుతోంది.
ప్రజ్వల్ రేవణ్ణ కేసును సీబీఐకి అప్పగించేలా రాజ్‌భవన్‌కు వరకు వెళ్లి పోరాడతానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి హెచ్చరించడం రాజకీయంగా కలకలం రేపింది. మాజీ సీఎం కుమారస్వామి ప్రకటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. బెంగళూరులోని సదాశివనగర్‌లోని నివాసం దగ్గర డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు.

అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసులో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిని పోరాడకుండా ఎవరు ఆపారు? మీ పోరాటాన్ని ఎవరూ ఆపలేదని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన తర్వాత నేను మాట్లాడుతామని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల లీక్ వెనుక డీకే శివకుమార్‌ను అనవసరంగా లాగడంపై మీడియా ప్రశ్నించగా. ఈ విషయంపై నేనే ఏం చెప్పాలో ముందే చెప్పాను.. ఇప్పుడు ఏమీ చెప్పనక్కర్లేదు. మిగతావి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దాం అని డీకే శివకుమార్ అన్నారు.
తాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెలుతున్నానని, త్వరలో బెంగళూరు వచ్చిన తరువాత ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ సీఎం కుమారస్వామి విషయంలో మాట్లాడుతానని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే టాపిక్. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసుకు సంబంధించిన మ్యాటర్. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుండటంతో కన్నడ మీడియాలో ఇదే హాట్ టాపిక్ కావడతో జేడీఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications