కర్ణాటక తీర్పు: 2నియోజకవర్గాల్లోనూ ఎదురీదుతున్న సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎదురీదుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 8గంటలకు ఎన్నికల కౌంటింప్రారంభం నుంచే సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి
ఆయన పోటీ చేస్తున్న చాముండేశ్వరి, బాదామి రెండు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్ధరామయ్యపై మొదట బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఆధిక్యం ప్రదర్శించారు.

అయితే, లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. మళ్లీ సిద్ధరామయ్య ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ శ్రీరాములు ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో హోరాహోరీ అన్నట్లుగా పోటీ సాగుతోంది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్యపై జేడీఎస్ అభ్యర్థి జేటీ దేవేగౌడ ముందంజలో ఉన్నారు.












Click it and Unblock the Notifications