కాంగ్రెస్ దెబ్బ: బళ్లారి గాలి సోమశేఖర్ రెడ్డి అరెస్టు, బీజేపీ ఆందోళనతో రగులుతున్న కర్ణాటక!

బెంగళూరు: బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో మంగళూరు బైక్ ర్యాలీని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. బెంగళూరు, మంగళూరు, మైసూరు, బళ్లారి, కోలారు, చిక్కబళ్లాపురం, చామరాజనగర్, హుబ్బళి, ఉత్తర కన్నడ తదితర జిల్లాల్లో వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

బళ్లారి నుంచి చలో మంగళూరు బైక్ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. బైక్ ర్యాలీ ముందుకు సాగిన రెండు నిమిషాలకే పోలీసులు అడ్డుకున్నారు. చలో మంగళూరు బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

Karnataka former BJP MLA Gali Somashekar Reddy arrested

ఆ సందర్బంలో గాలి సోమశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్విదానికి దిగారు. గాలి సోమశేఖర్ రెడ్డితో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెంగళూరులో మాజీ మేయర్ కట్టే సత్యనారాయణ, బీజేపీ కార్పొరేటర్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Karnataka former BJP MLA Gali Somashekar Reddy arrested

సీఎం సిద్దరామయ్య చలో మంగళూరు బైక్ ర్యాలీని అడ్డుకోవచ్చు కాని ప్రజల మనోభావాలని అడ్డుకోవడానికి సాధ్యం కాదని కేంద్ర మంత్రి సదానందగౌడ సోషల్ మీడియాలో మండిపడ్డారు. హిందూ సంఘ, సంస్థల నాయకులు, కార్యకర్తల హత్యలను ఖండిస్తూ కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి చలో మంగళూరు బైక్ ర్యాలీని బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+