మాజీ సీఎంకు సొంత పార్టీలో సెగ, ఏం చెయ్యాలిరా దేవుడా?, మింగలేక కక్కలేక అయోమయంలో!
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. అయితే మండ్యలో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి పేరు మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. కర్ణాటక మాజీ సీఎంహెచ్‌డీ కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేయడం ఖాయమైనప్పటికీ సొంత పార్టీ జేడీఎస్ కార్యకర్తలు ఆయన పోటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు మాజీ సీఎంకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.
మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఓ వైపు మండ్య జిల్లా జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో మరోవైపు జేడీఎస్ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో మండ్య నుంచి పోటీ చేసే విషయంలో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి డైలమాలో పడిసోయారు. మరోవైపు మండ్య టికెట్ దక్కకపోవడంతో ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మండ్య నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు ఒప్పందం ప్రకారం జేడీఎస్ కి పోటీ చేసేందుకు మూడు లోక్ సభ నియోజకవర్గాలు కేటాయించారు. దీంతో మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత కూడా బీజేపీ టిక్కెట్టును కోల్పోయారు. అయితే మండ్య నుంచి పోటీ చేసేందుకు హెచ్‌డీ కుమారస్వామి కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. మండ్యలో జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కుమారస్వామిని అక్కడి నుంచి రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు.
బెంగళూరు జేపీ నగర్ నివాసానికి వెళ్లిన మండ్య జిల్లా జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు హెచ్‌డీ కుమారస్వామిని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసారి చెన్నపట్టణ నాయకులను సంప్రదించి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని మాజీ సీఎం కుమారస్వామి మండ్య జిల్లా జేడీఎస్ నాయకులకు చెప్పారు. అయితే చెన్నపట్టణ జేడీఎస్ కార్యకర్తలు మాత్రం మండ్య నుంచి మీరు పోటీ చేయకూడదని కుమారస్వామిని పట్టుబట్టారు. దీంతో హెచ్‌డీ కుమారస్వామికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
మండ్య నుంచి హెచ్ డీ కుమారస్వామి పోటీ చేస్తే చెన్నపట్టణలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి వస్తుందని ఆయన్ను మండ్యలో పోటీ చెయ్యకూడదని పట్టబడుతున్నారు. చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకున్న హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం బెంగళూరులోని జేపీ నగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. తరువాత మాజీ సీఎం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ మండ్య జిల్లా ప్రజలు నామీద ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని, తన మీద వాళ్లకు ఎక్కువ నమ్మకం ఉందని అన్నారు.
మండ్య జిల్లా ప్రజలు చూపిస్తున్న ఈ ప్రేమను తాను మరిచిపోలేనని, నాకు ఇప్పటి వరకు మూడుసార్లు గుండె శస్త్రచికిత్సలు జరిగాయని, నా ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు పార్టీ పనులు చూసుకోవాలని, అలాగే ప్రజలకు సేవ చేయాలని ఆశపడుతున్నానని కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణలోని జేడీఎస్ మద్దతుదారులు మాత్రమే మండ్య నుండి పోటీ చేయకూడదని తనను పట్టుబడుతున్నారని కుమారస్వామి అంటున్నారు. చెన్నపట్టణను మీరు వదిలి లోక్‌సభకు పోటీ చేస్తే రామనగర జిల్లా మాకు దూరం అవుతుందని జేడీఎస్ కార్యకర్తలు కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు.
మండ్య నుంచి పోటీ చేస్తే రామనగర జిల్లాలోని జేడీఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతుందని, అంతేకాకుండా చెన్నపట్టణను మళ్లీ జేడీఎస్ సొంతం చేసుకోవడం కష్టమని ఆ పార్టీ మద్దతుదారులు పట్టుబట్టారు. అయితే చెన్నపట్టణ కార్యకర్తలను ఒప్పించడంలో దళపతులు సఫలం అయ్యారు. మండ్య, రామనగర జిల్లాల కార్యకర్తలను మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి ఒప్పిస్తారని నిఖిల్ కుమారస్వామి అన్నారు.
మండ్యలో సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ తదుపరి ఎత్తుగడ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీయేతర అభ్యర్థిగా పోటీ చేసి మండ్యలో ఎంపీగా గెలిచిన ఆమె తరువాత బీజేపీకి మద్దతు పలికారు. కానీ బీజేపీ నాయకులు మండ్య సీటును జేడీఎస్ కు ఇచ్చేశారు. సుమలతతో సయోధ్య కోసం ఆమెకు వేరే సీటు ఇస్తామని బీజేపీ చెప్పినట్లు కనిపించడం లేదు. కాబట్టి సుమలత తదుపరి ఎత్తుగడ ఏమిటనేది మండ్య జిల్లా ప్రజలకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications