ప్రధానికి బీహార్ మీద ప్రేమ, కర్ణాటక మీద కక్ష, ఏం జరిగిందో, మాజీ సీఎం సెటైర్లు!
బెంగళూరు: బీహార్ మీద ఉన్నటువంటి ప్రేమా, అభిమానాలు కర్ణాటక మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఎందుకు లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. బీహార్ వరద విషయంలో వెంటనే స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక వరదల విషయంలో రెండు నెలలు అయినా స్పందించలేదని, సీఎం యడియూరప్ప మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఏమైనా కక్ష ఉందా ? అని మాజీ సీఎం సిద్దరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.

విశాల హృదయం కాదు బండరాయి
బీహార్ వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ 52 ఇంచుల విశాల హృదయం చూపించారని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అదే కర్ణాటక వరద ప్రాంతాల ప్రజలను ఆదుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గుండె బండరాయి అయ్యిందని మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో ఎద్దదేవ చేశారు.

25 మంది ఎంపీలను ఇస్తే !
కర్ణాటక 25 మంది బీజేపీ ఎంపీలను ఇచ్చిందని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ కర్ణాటక ఎంతో చేసిందని, కన్నడిగులు ఓట్లు వేస్తేనే 25 మంది ఎంపీలు వచ్చారు అనే విషయం ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం సిద్దరామయ్య సూచించారు.

సీఎం మీద ప్రధానికి కక్షా ?
బీహార్, కర్ణాటక వరదల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తారతమ్యం చూపిస్తున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు ఈ విషయంలో ఆలోచిస్తే సీఎం యడియూరప్ప మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఏమైనా ద్వేషం ఉందా? అనే అనుమానం వస్తోందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

బీహార్ సీఎంతో మాట్లాడాను
బీహార్ లో వచ్చిన వరదల విషయంలో తాను ఎంతో భాదపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో తాను మాట్లాడానని, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చెయ్యడానికైనా సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పారని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు.

ఖాళీ చేతులతో పంపిచారు
కర్ణాటక వరద ప్రాంతాలను ఆదుకోవాలని, ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి వెంటనే సహాయం చెయ్యాలని సీఎం యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు మనవి చేశారని, రెండుసార్లు ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసినా ఫలితం లేదని, అన్నిసార్లు ఖాళీ చేతులతో బెంగళూరు పంపించారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కన్నడిగుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తారతమ్యం చూపిస్తున్నారని, బీహార్ విషయంలో చూపించిన శ్రద్దలో కేవలం 20 శాతం కర్ణాటక మీద చూపించలేదని మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో మండిపడ్డారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications