పనికిమాలిన హోమ్ మంత్రి ఉంటే ఇలాగే జరుగుతోంది, రౌడీలు, హంతకులకు సన్మానాలు, సిద్దూ !
బెంగళూరు/మైసూరు: ఐటీ హబ్ బెంగళూరులో యువతిని కిడ్నాప్ చేసి కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చెయ్యడం దారుణం అని, చేతకాని హోమ్ మంత్రి ఉండటం వలనే బెంగళూరులో ఇలాంటి దారుణం జరిగిందని విధానసౌధలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మండిపడ్డారు. కర్ణాటకలోని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉండటంతో ప్రజలకు లేనిపోని ఇబ్బందులు ఎదురౌతున్నాయని సిద్దరామయ్య ఆరోపించారు.
కగ్గలిపురలో బాలిక మీద అత్యాచారం జరిగిన వారం రోజుల్లోపే బెంగళూరులోని కోరమంగలో యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు ఆమెను కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారని సిద్దరామయ్య మండిపడ్డారు. అసలు కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ పని చేస్తుందా ?, అసలు ప్రభుత్వం ఉందా అని మాజీ సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

సంఘవ్యతిరేక శక్తులను కట్టడి చెయ్యాల్సిన బీజేపీ ప్రభుత్వం హంతకులు, రౌడీషీటర్లను బీజేపీలోకి చేర్చుకుని వారికి సన్మాలు, సత్కారాలు చేస్తున్నదని మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరును శాసనసభలో మేము (కాంగ్రెస్) ప్రశ్నిస్తే ఒంటి మీద చీమకుట్టినట్లుకూడా చలనం లేకుండా హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుర్చున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
రౌడీషీటర్ల మీద కఠిన చర్యలు తీసుకోవలసిన కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హంతకులు, స్యాంట్రో రవి లాంటి క్రిమినల్స్ ను. రౌడీషీటర్లను కాపాడుతున్నారని సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర, పోలీసులు ఇలా పని చేస్తున్నారని, ఇక ఎన్నికలు అయిపోయిన తరువాత వీళ్లు ఏం చేస్తారు అని ప్రజలు భయపడిపోతున్నారని సిద్దరామయ్య బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications