కర్ణాటకలో ఆపరేషన్ కమల, బీజేపీకి అధికారం, బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రిసార్టులో!

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అంటూ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన సతీష్ జారకిహోళి తాను మాత్రం పార్టీ మారను అంటూ సమాదానం ఇచ్చారు. మాజీ మంత్రి సతీష్ జారకిహోళి ఓ రిసార్టుకు వెళ్లిన సందర్బంగా ఈ విషయాలు మీడియాకు చెప్పడంతో ఆపరేషన్ కమల మళ్లీ తెరమీదకు వచ్చింది.

రిసార్టులో మాజీ మంత్రి

రిసార్టులో మాజీ మంత్రి

బెళగావి జిల్లా ఖానాపుర తాలుకాలోని కణకుంబి సమీపంలోని రిసార్టులో సోమవారం మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి ప్రత్యక్షం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా రిసార్టు దగ్గరకు వెళ్లింది. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సతీష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

24 మంది రెబల్ ఎమ్మెల్యేలు

24 మంది రెబల్ ఎమ్మెల్యేలు

మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆపరేషన్ కమల పేరుతో బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని చాలకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో రిసార్టులో ప్రత్యక్షం అయిన సతీష్ జారకిహోళి కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

8 మంది నిజం

8 మంది నిజం

మంత్రి పదవులు రాలేదని 7 నుంచి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్న మాట వాస్తవం అని సతీష్ జారకిహోళి బాంబు పేల్చారు. అయితే ఎంత మంది పార్టీని వదిలిపెడతారో అనే విషయం చెప్పడం సాధ్యం కాదని సతీష్ జారకిహోళి అన్నారు.

ఆరు నెలల స్కెచ్

ఆరు నెలల స్కెచ్

గత ఆరు నెలల నుంచి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని సతీష్ జారకిహోళి ఆరోపించారు. ఆపరేషన్ కమలకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని సతీష్ జారకిహోళి అన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదని సతీష్ జారకిహోళి జోస్యం చెప్పారు.

ఇది నా నిర్ణయం

ఇది నా నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి బీజేపీ గాలం వేస్తోందని, అయితే 24 మంది ఎమ్మెలు జంప్ కారని, 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని మాజీ మంత్రి సతీష్ జారకిహోళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వదిలి వేరే పార్టీలో చేరనని సతీష్ జారకిహోళి స్పష్టం చేశారు.

ఒకే ఇంటిలో ఇద్దరు మంత్రులు

ఒకే ఇంటిలో ఇద్దరు మంత్రులు

బెళగావి శాసన సభ సమావేశాల కంటే ముందే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సతీష్ జారకిహోళి అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి ఆశించడంలేదని సతీష్ జారకిహోళి అన్నారు. ఇప్పుడే తన సోదరుడు రమేష్ జారకిహోళి మంత్రిగా ఉన్నారని, ఒకే ఇంటిలో ఇద్దరికి మంత్రి పదువులు ఇవ్వకూడదని సతీష్ జారకిహోళి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రిసార్టుకు రెబల్ ఎమ్మెల్యేలు

రిసార్టుకు రెబల్ ఎమ్మెల్యేలు

శాసన సభ్యుడిగానే తాను మంత్రి కంటే ఎక్కువ ప్రజాసేవ చేస్తున్నానని, ఇంత కంటే ఏం కావాలని సతీష్ జారకిహోళి అన్నారు. సతీష్ జారకిహోళి రిసార్టులో మాకం వెయ్యడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+