మాజీ సీఎం టార్గెట్, మేడమ్ ను రంగంలోకి దింపిన సీఎం, ఎవరి ధీమా వాళ్లదే, యువరాజు కూడా !

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండడంతో రాజకీయ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు ఎన్నికల వ్యూహం పన్నారు. అయితే మండ్యలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి మండ్య మాజీ సీఎం, కాంగ్రెస్‌ నాయకురాలు, బహుబాష నటి రమ్యా ఎన్నికల బాజా మ్రోగించనున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్టార్ చంద్రు తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు మాజీ ఎంపీ, నటి రమ్యా అంగీకరించినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో మండ్య కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు తరపున నటి రమ్యా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Karnataka former MP and actress Ramya is ready to campaign in Mandya

వచ్చే వారం మండ్య కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రుతో కలిసి నటి రమ్యా రోడ్ షో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నారని వెలుగు చూసింది. మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నది. మండ్యలో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి ఓటమి రుచి చూపించాలని కాంగ్రెస్‌ నేతలు పక్కా ప్లాన్‌ చేశారని, అందుకు అనుగుణంగా ఏప్రిల్‌ 17వ తేదీ లేదా 20వ తేదీన మండ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మండ్యలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీని ఆహ్వానిస్తారని, ఇదే సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొంటారని, అందరూ మండ్యలో ఎన్నికల ప్రచారం చేయనున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తెలిపారు. మండ్య జిల్లాలో సిద్దరామయ్య ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇతర లోక్‌సభ నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని మండ్య లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు అన్నారు.

Karnataka former MP and actress Ramya is ready to campaign in Mandya

రాజకీయంగానే కాదు అభివృద్ధి విషయాల్లో కూడా మండ్య పేరు భారతదేశమంతా వినిపించాలని మండ్యను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని స్టార్ చంద్రు అన్నారు. మండ్య జిల్లా సహజంగానే కాకుండా రాజకీయంగా దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందింది. మండ్య జిల్లాకు వ్యవసాయమే జీవనాధారం. ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి స్థానికంగా ఉపాధి కల్పించాలనే కల తనకు ఉందని స్టార్ చంద్రు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేదలు, అణగారిన వర్గాల కోసం. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పార్టీ అని. ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఆరోగ్య సేవలతో సహా దేశ ప్రజల సంక్షేమం కోసం 25 ఉచిత హామీలతో కూడిన మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని, మండ్య జిల్లా ఓటర్లు చైతన్యంతో ఉన్నారని, వాళ్లు నన్ను ఆశీర్వదించి, కాంగ్రెస్‌ చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు గుర్తింపు ఇస్తారని విశ్వాసం ఉందని స్టార్ చంద్రు ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+