తమిళనాడుకు 177 టీఎంసీల కావేరీ నీరు విడుదల చెయ్యాలి, సుప్రీం కోర్టు, కర్ణాటక దెబ్బ!
Recommended Video

Cauvery Water Dispute : Karnataka's Gain Is Tamil Nadu's Loss
బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. తమిళనాడుకు 177 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పత్రి సంవత్సరం కర్ణాటక తమిళనాడుకు 177 టీఎంసీల నీరు విడుదల చెయ్యాల్సిఉంది.
దశాభ్దాల కాలం నుంచి వివాదంలో ఉన్న కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు అంతిమతీర్పు చెప్పింది. తమిళనాడుకు ప్రతిసంవత్సరం 177 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు కర్ణాటకకు సూచించింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకకు 14.5 టీఎంసీలు నీరు అదనంగా మిగిలింది. అంతే కాకుండా బెంగళూరు నగరానికి 4.2 టీఎంసీల అదనపు నీరు సరఫరాకానుంది. దశాభ్దాల కాలంగా తమిళనాడు, కర్ణాటక చేసిన న్యాయపోరాటంలో చివకి కర్ణాటక సుప్రీం కోర్టులో విజయం సాధించింది.












Click it and Unblock the Notifications