రాజకీయం అంటే ఇదే, రూ. 150 కోట్లు బూడిద, అధికార పార్టీ క్లారిటీతో, లీక్ !
బెంగళూరు/తుమకూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మాకు మేమే గొప్ప అంటూ మంత్రులు ప్రవర్థిస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. వర్గ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు అని కొత్తగా చెప్పనవసరం లేదు.
ఇప్పుడు కర్ణాటకలో మరోసారి ఇలాంటి రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గత నెలన్నర వ్యవధిలో వివిధ కేసుల్లో రూ. 150 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, ఆ డ్రగ్స్ మొత్తం కాల్చి బూడిద చేశామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కొరటగెరెలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ దందాను అరికట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. గత నెలన్నర కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో కర్ణాటక రాష్ట్ర పోలీసులు రూ.150 కోట్లకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని తగులబెట్టారని అన్నారు.
తొలినాళ్లలో గ్రామాల్లో టమాటా మొక్కల మధ్య గంజాయిని పెంచేవారని, తర్వాత పలు పంటల్లో గంజాయి పెంచడం మొదలుపెట్టడం దురదృష్టకరం అని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ విచారం వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు మొక్కల రూపంలో పెరుగుతున్నాయని, వాటిని పూర్తిగా అడ్డుకుంటామని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు.
కానీ ఇప్పుడు గంజాయి తక్కువ కావడంతో డ్రగ్స్ తో తయారు చేసిన మాత్రలు వేసుకుంటున్నారని వెలుగు చూసిందని, గంజాయి, డ్రగ్స్, కొకైన్, చరస్, హెరాయిన్‌తో సహా వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు. దీంతో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, త్వరలో కర్ణాటకలో ఎక్కడా డ్రగ్స్ కనపడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications