Yuva Nidhi: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి..

నిరుద్యోగులకు శుభవార్త.. ఇక నుంచి డిగ్రీ చేసిన వారికి రూ.3 వేలు, డిప్లమా చేసిన వారికి రూ.1500 బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఇది తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్ లోనో కాదు.. పక్కనున్న కర్ణాటకలో. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. ఐదు గ్యారెంటీల్లో ఒకటైన యువ నిధి పథకాన్ని తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం డిగ్రీ, డిప్లమా చేసిన నిరుద్యోగులకు స్టైపండ్ ఇవ్వనున్నారు.

డిగ్రీ చేసినవారికి నెలకు రూ.3 వేలు ఇవ్వనుండగా.. డిప్లమా చేసిన వారికి నెలకు రూ.1,500 అందించనున్నారు. ఈ పథకాన్ని శుక్రవారం శివమొగ్గలో సీఎం సిద్ధరామయ్య మొదలు పెట్టారు. అర్హులైన ఆరుగురు నిరుద్యోగులకు స్టైఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇది వచ్చే ఏడాది రూ.1,200 కోట్లకు పెరుగుతుందని తెలిపారు.

Karnataka government has launched Rs 3 thousand stipend scheme for the unemployed

ఇది 2026 నుంచి ఏటా రూ.1,500 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2022-23 అకడమిక్ సంవత్సరంలో పాస్ అయి, జాబ్ దొరకనోళ్లు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. వీళ్లకు రెండేండ్ల పాటు స్టైఫండ్ అందించనున్నారు. ఈ సమయంలో జాబ్ వచ్చినట్లయితే స్టైఫండ్ నిలిపివేస్తారు. డిగ్రీ తర్వాత పై చదువులు చదువుతున్న వారికి ఈ పథకానికి అనర్హులు.

Karnataka government has launched Rs 3 thousand stipend scheme for the unemployed

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారు. తాము ఇప్పటికే ప్రారంభించిన శక్తి, అన్న భాగ్య, గృహలక్ష్మి, గృహజ్యోతి గ్యారంటీల కింద 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ప్రకటించారు. కాంగ్రెస్ కర్ణాటకలో హామీ ఇచ్చినట్లుగానే తెలంగాణలో కూడా గ్యారెంటీల హామీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+