దెబ్బకు దెయ్యం దిగాలంటే ఆపని చెయ్యలి, ప్రత్యర్థి పార్టీ రూల్స్ పాటిస్తున్న హోమ్ మంత్రి !

డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టాలని నిర్ణయించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉంది. డ్రగ్ ఫ్రీ కర్ణాటక క్యాంపెయిన్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ నాశనం చేసే కార్యక్రమం బెంగళూరు రూరల్ జిల్లా డాబుస్‌పేట్‌లోని కర్ణాటక వేస్టేజ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ ఏరియాలో జరిగింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా అడ్డుకోవాలని సిద్దరామయ్య ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ..పరమేశ్వర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వారి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. దీని ద్వారా డ్రగ్స్ రాకెట్‌ను అరికట్టాలనే ఆలోచన ఉందని, అందుకోసం కొత్త చట్టాన్ని అమలు చేస్తామని హోం మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. విద్యార్థులు వ్యసనాల బారిన పడుతున్నారని, పంజాబ్‌లోని ప్రతి యువకుడు డ్రగ్స్ కు బానిస అవుతున్నాడని, ఆరాష్ట్రంలో డ్రగ్స్ కలిపిన చాక్లెట్‌లను విక్రయిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు.

Karnataka government is preparing to confiscate the properties of drug dealers

కాలేజీ పిల్లలు కూడా ఈ హానికరమైన డ్రగ్స్‌ చాక్లెట్లకు బానిసలవుతున్నారు. నిత్యం వ్యసనంతో యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాగే ఇలాంటి వ్యాపారం చేసే వారు ఇతరులను దానికి బానిసలుగా మార్చాలనే దురుద్దేశంతో ఉండవచ్చు అని, అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక హోం శాఖ సిద్ధమైందని, ఇందుకు సంబంధించి దోషుల ఆస్తులను జప్తు చేసేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.

డ్రగ్స్ వల్ల నేటి సమాజం నాశనమవుతోందని, ఈ మాదకద్రవ్యాల వ్యాపారం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురి చేసిందని, దేశ భవిష్యత్తుగా చెప్పుకునే యువత ఈ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, ఇలాంటి సమయంలో మంచి సమాజాన్ని నిర్మించడమే అతిపెద్ద సవాల్ అని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి సవాల్ గా మారిన డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కొన్ని చిన్న దేశాలు విఫలమయ్యాయని హోం మంత్రి పరమేశ్వర్ చెప్పారు.

Karnataka government is preparing to confiscate the properties of drug dealers

హాలండ్, స్విట్జర్లాండ్‌తో సహా మరికొన్ని దేశాలు డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడానికి ప్రయత్నించడం మానేసి ఓటమిని అంగీకరించాయని, అలాంటి పరిస్థితి మన దేశానికి రాకూడదని, ఇప్పుడే మనం మేల్కోవాలని, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లోని యువత చేతుల్లోకి డ్రగ్స్ అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటామని, అందుకు ప్రజలకు కూడా సహకరించాలని కర్ణాటక హోం మంత్రి హొం మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరస్తుల భరతం పట్టడానికి వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లే కర్ణాటకలో డ్రగ్స్ వ్యాపారుల ఆస్తులు జప్తు చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+