ఐటీ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం, అన్ని గంటలు పని చేస్తే అంతే కథ
కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంపై పలు ఐటీ కంపెనీలు యాజమాన్యం, కార్పోరేట్ కంపెనీల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఐటీ కంపెనీ ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల పని గంటలు పెంచే ప్రతిపాదనపై కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే ముందుకు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయని వెలుగు చూసింది.

ఐటీ కంపెనీలో ఉద్యోగులకు పని గంటలు పెంచే విషయంలో ప్రతిపాదనలు వచ్చాయని, ఈ విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ ది హిందూతో చెప్పారు. ప్రతిపాదన ప్రకారం ఐటీ/బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు 12 గంటలకు మించి ఉద్యోగాలు చెయ్యవచ్చు అని కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సిద్దం అయ్యిందని వెలుగు చూసింది.

ఐటీ రంగంలోకి ఉద్యోగులు ఒక రోజులో 14 గంటలు పని చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ అనుమతి ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురావడానికి సిద్దం అయ్యిందని తెలిసింది. అయితే ప్రస్తుత కార్మిక చట్టం ప్రకారం ఓవర్ టైమ్ అంటే ఓటీతో కలిసి 10 గంటలు మాత్రమే పని చెయ్యడానికి అవకాశం ఉంది. మూడు నెలల్లో ఓ ఉద్యోగితో 125 గంటలకు మంచి ఎక్కువ గంటలు పని చేయించుకోచ్చు అని ఇందులో మరో అంశం ఉంది. అయితే ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక కార్మిక శాఖ సంతోష్ లాడ్ అంటున్నారు.
125 గంటల గరిష్ట పరిమితి వల్ల కంపెనీల యాజమాన్యం వారికి కావలసిన రోజుల్లో ఉద్యోగులతో పని చేయించుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం వారంలో 48 గంటలకు మంచి పని చెయకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయని, ఇలా ఉద్యోగులు పని చేస్తే వారు శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి బిల్లు ప్రవేశ పెట్టడానికి అంగీకరించకూడదని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications