స్కూల్ పిల్లల పాఠ్యపుస్తకాల్లో సావర్కర్, హెడ్గేవార్ పాఠాలు ఔట్, అంబేద్కర్, నెహ్రూలు ఇన్ !

బెంగళూరు: ఇంతకాలం వివాదంగా మారిన పాఠ్యపుస్తకాల సవరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం పాఠ్యపుస్తకాన్ని సవరిస్తుంది అని విద్యాశాఖ మంత్రి స్వయంగా ధృవీకరించారు. హెడ్గేవార్‌, సావర్కర్ ల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో నుంచి కర్ణాటక ప్రభుత్వం తొలగించింది. ఇదే సందర్బంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ కవితలను పాఠాలలో చేర్చబోతున్నట్లు గురువారం కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతంలో బీజేపీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాన్ని సవరించడంతో వివాదం చెలరేగింది. అప్పట్లో ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల మార్పును పరిష్కరిస్తామని చెప్పారు. స్కూల్ పిల్లల పుస్తకాల నుండి హెడ్గేవార్, వినాయక దామోదర్ సావర్కర్, చక్రవర్తి సూలిబెలే వచనాలు, వారి చరిత్రను తొలగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి మధు బంగారప్ప మీడియాకు చెప్పారు.

Karnataka Govt removes Hedgewar and Savarkar texts from school childrens text books.

సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విధానసౌదలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెక్స్ట్ రివిజన్ నిర్ణయం కూడా ఇందులోనే, కె.బి. హెడ్గేవార్, వినాయక దామోదర్ సావర్కర్, చక్రవర్తి సూలిబెలే రచనలు, వారి చరిత్రను తొలగించాలని నిర్ణయించారు. రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్ అంబేద్కర్ కవితలు, నెహ్రూ కవితలు సిలబస్‌లో చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత నెల రోజులుగా విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలకు తెరపడింది.

బీజేపీ ప్రభుత్వ హయాంలో సవరించిన పాఠ్య పుస్తకాలన్ని విద్యాశాఖ ఇప్పటికే ముద్రించింది. ముద్రించిన పుస్తకాలను పాఠశాలలకు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటకలో 72 వేలకు పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. కోటి మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం విద్యాశాఖ ఇప్పటికే రూ. 262 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను సవరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటికీ గతంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఆరోపిస్తోంది.

బీజేపీ హయాంలో టెక్ట్స్ రివిజన్ కమిటీ చైర్మన్ రోహిత్ చక్రతీర్థపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతో పాటు రోహిత్ చక్రతీర్థ కమిటీ నిర్ణయంపై పలు సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 262 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రోహిత్ చక్రతీర్థపై సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? అనే సందేహం తలెత్తింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సీటీ రవి కూడా కాంగ్రెస్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల సవరణను వ్యతిరేకించారు. మాజీ విద్యాశాఖ మంత్రి బీసీ. నగేష్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటి మధ్య ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పాఠ్యపుస్తకాన్ని సవరిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోరుకు రంగం సిద్దం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+