మోడీ షాక్: రిసార్ట్ కు రూ. 982 కోట్లు ఫైన్, అంతలోనే కాంగ్రెస్ కు ప్రేమ, ఆంధ్రా వ్యాపారి ఎవరు ?
శ్రీమంతులకు మాత్రమే పరిచయం ఉన్న బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
బెంగళూరు: శ్రీమంతులకు మాత్రమే పరిచయం ఉన్న బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. రాజ్యసభ ఎన్నికల సందర్బంగా ఆపరేషన్ కమల భయంతో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో పెట్టారు.
ఈగల్టన్ రిసార్ట్ లో, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడం లోక్ సభ దద్దరిల్లింది. రాజ్యసభ ఎన్నికలను టార్గెట్ చేసుకుని బీజేపీ నాయకులు ఆదాయపన్ను శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని తమ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఈగల్టన్ రిసార్ట్ కు రూ. 982 కోట్లు ఫైన్
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ కు రూ. 982 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అదే రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాసన సభ్యులు కర్ణాటక ప్రభుత్వం నిర్బంధించడంతో విమర్శలు ఎదురైనాయి.
Recommended Video


రూ. లక్షలు ఖర్చు అవుతోందని !
గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు వేరే రిసార్ట్ లో బపచేస్తే లక్షల రూపాయల నగదు ఖర్చు చెయ్యాలని, ఈగల్టన్ రిసార్ట్ లో ఉంటే తమకు ఎలాంటి ఖర్చు ఉండదని కర్ణాటక ప్రభుత్వం భావించిందని, అందుకే అక్రమంగా నిర్మించిన ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ ను ఎంపిక చేసుకున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపించారు.

509 ఎకరాల్లో రిసార్ట్
బెంగళూరు నగరానికి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలోని బిడది సమీపంలో 509 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఈగల్టన్ రిసార్ట్ నిర్మించారు. అయితే కర్ణాటక పర్యాటక శాఖ నియమాలు ఉల్లంఘించి ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ నిర్మించారని ఇటీవల సిద్దరామయ్య ప్రభుత్వం ఆరోపించింది.

ఆంధ్రా వ్యాపారి ఎవరంటే ?
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మేద అశోక్ కుమార్ 2000వ సంవత్సరంలో ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ నిర్మించారు. ప్రస్తుతం మేద అశోక్ కుమార్ కుమారులైన కిరణ్ కుమార్, చేతన్ ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ నిర్వహణ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

అంతలోనే మార్పు
నియమాలు ఉల్లంఘించి 77 ఎకరాలు కబ్జా చేసి ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ నిర్మించారని, 77 ఎకరాలు కబ్జా చేసినందుకు రూ. 982 కోట్లు పరాదరుసుం చెల్లించాలని, లేదంటే 77 ఎకరాలు భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించామని ఇటీవల కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ. జయచంద్ర చెప్పారు. అయితే ఇంతలోనే ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ మీద కాంగ్రెస్ కు ప్రేమ పుట్టుకొచ్చిందని కర్ణాటక బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications