లెక్క మార్చిన మోదీ, సిట్టింగ్ మంత్రులు, ఎంపీలకు మరోచాన్స్?, ప్లాన్ రివర్స్ అయితే ఢమాల్!
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారీ సన్నాహాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఇచ్చే పద్ధతినే లోక్‌సభ ఎన్నికల్లోనూ అనుసరించాలని బీజేపీ హైకమాండ్ మొదట లెక్కలు వేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి తీసుకొచ్చిన మార్పుల ప్రకారం యువ నేతలను ప్రోత్సహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
కర్ణాటకకు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలకు వయోపరిమితి ప్రాతిపదికన టిక్కెట్లు ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ ఇంతకు ముందు ఆలోచన చేసింది. దీని ప్రకారం కర్ణాటకలో ప్రస్తుత ఎంపీలకు టికెట్ ఇవ్వకుండా కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ప్లాన్ చేసింది. 75 ఏళ్లు దాటిన బీజేపీ సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టాలని బీజేపీ నిర్ణయించిందని తెలిసింది. అయితే మళ్లీ గెలిచే సత్తా ఉన్న నాయకులు, ఎలాంటి కళంకం లేని సీనియర్ ఎంపీలకు మళ్లీ ఎంపీ టిక్కెట్లు ఇవ్వడం మంచిదని కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకత్వం అభిప్రాయపడింది.

కానీ 73 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న ఎంపీలకు టిక్కెట్లు రాకపోవచ్చని తెలిసింది. వయసు మీదపడినా గెలుపు ప్రాతిపదికన మరోసారి సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వాలని కర్ణాటక బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సవాల్ విసిరేందుకు బీజేపీ కూడా జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతోపాటు వయో పరిమితిని సాకుగా చూపి పలువురు సీనియర్ ఎంపీలకు టికెట్లు నిరాకరించడం ఓటమికి దారితీస్తుందని లెక్కలు వేసుకున్న కర్ణాటక బీజేపీ నేతలు ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ తో చర్చించారని వెలుగు చూసింది.
75 ఏళ్లు దాటిన 25 మంది సిట్టింగ్ బీజేపీ ఎంపీల్లో చామరాజనగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ ప్రసాద్, చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఎన్ బచ్చెగౌడ ఈసారిపోటీ చెయ్యమని చెప్పి ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటికీ తాను పోటీ చేయనని తుమకూరు నియోజకవర్గం ఎంపీ జీఎస్ బసవరాజు చెప్పారు. 70 ఏళ్లు దాటిన విజయపూర్‌కు చెందిన రమేశ్ జిగజినాగి, దావణగెరెకు చెందిన జీఎం సిద్దేశ్వర్, బళ్లారికి చెందిన దేవేంద్రప్ప, కొప్పాల కారడి సంగన్న, బాగల్‌కోటకు చెందిన పీసీ గడ్డిగౌడ్‌లకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం సముచితమని కమలం శిబిరంలో వినిపిస్తోంది.

ఇప్పటికీ చరిష్మా ఉన్న గెలవగల సామర్థ్యం ఉన్నవారికి టిక్కెట్లు ఇస్తే బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం సులువు అవుతుందని ఆపార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. వయో పరిమితిని బట్టి కొందరికి టికెట్లు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించినట్లయితే ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా సమర్థవంతమైన అభ్యర్థి లేకపోయినా ఆ ఎంపీలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో స్థానిక నేతలతో బీజేపీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. వయసు సాకుగా చూపి సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించరాదన్న అభిప్రాయాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలకు తెలియజేసినట్లు సమాచారం.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై











Click it and Unblock the Notifications