మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్, ఫోక్సో కేసులో మధ్యంత బెయిల్ ఇచ్చిన హైకోర్టు, సీఐడీకి ఆర్డర్ !
పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బాధితుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ఎట్టకేలకు మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్ణాటక హైకోర్టు సీఐడీ పోలీసు అధికారులను ఆదేశించింది.
ఇదే సమయంలో బీఎస్ యడియూరప్ప కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం యడియూరప్పపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని కోర్టు చెప్పింది.

తదుపరి విచారణ జరిగే వరకు బీఎస్ యడ్యూరప్పను అరెస్ట్ చేయరాదని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఐడీ అధికారుల అరెస్టు భయం నుంచి కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యారు. జూన్ 17వ తేదీన సీఐడీ అధికారుల ముందు హాజరుకావాలని మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పను ఆదేశించిన కోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తరపున సీనియర్ న్యాయవాది సీవీ. నాగేష్ వాదించారు. మాజీ సీఎం యడియూరప్పపై నమోదు అయిన ఒక కేసును రద్దు చేయాలని, మరొక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు దాఖలైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుకు బ్లాక్ మెయిల్ చేయడమే పని అని, ఈ కేసులో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందని, ఇతరులపై కేసులు పెట్టడమే ఆమె వృత్తి అని, ఇప్పటివరకు ఆ మహిళ ఇతరుల మీద దాదాపు 53 కేసులు పెట్టిందని, ఇక్కడ వాస్తవాలు చెప్పాలి అని మాజీ సీఎం యడియూరప్ప న్యాయవాది కోర్టుకు చెప్పారు.
2024 ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల బాలికపై మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మార్చి 14వ తేదీన సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం బీఎస్ యడ్యూరప్ప కూడా సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడు నెలల తర్వాత కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జూన్ 12వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు జూన్ 11వ తేదీన మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications