కోర్టును దిక్కరిస్తారా?, బీబీఎంపీకి చివాట్లు పెట్టి నోటీసులు ఇచ్చిన హైకోర్టు, చెరువు దగ్గర!
ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రోడ్డు నిర్మిస్తున్న బెంగళూరు మహానగర కార్పొరేషన్ (BBMP)కి కర్ణాటక హైకోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరులోని మల్లత్తహళ్లి చెరువు ప్రాంతంలో తాత్కాలికంగా లేదా శాశ్వత నిర్మాణ చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు గత ఏడాదిలోనే బీబీఎంపీ అధికారులను ఆదేశించింది.
అయితే హైకోర్టు ఆదేశాలను గాలికి వదిలేసిన బీబీఎంపీ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని మల్లత్తహళ్లి చెరువులో గణేశుని నిమజ్జనంతో సహా ఎలాంటి పండుగలకు అనుమతి ఇవ్వరాదని, ఎటువంటి పనులు చెయ్యకూడదని సరిగ్గా ఏడాది క్రితం అంటే గతేడాది 2023 మార్చి రెండో వారంలో కర్ణాటక హైకోర్టు బీబీఎంపీ అధికారులను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.

ఇదిలావుంటే కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై న్యాయవాది గీతా మిశ్రా బీబీఎంపీపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్ విచారణ చేపట్టింది. బెంగళూరులోని మల్లతహళ్లి చెరువు దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
అందులో ఒక భాగంలో ఆ ప్రాంతానికి సంబంధించి వివాదం నెలకొంది. ఈ చెరువు అభివృద్ధి, వ్యాజ్యాల గురించి న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ప్రతివాదికి నోటీసు జారీ చేయాలని హైకోర్టును ఆదేశించింది. కోర్టు దిక్కరణ కేసులో నోటీసులు అందుకుంటున్న బీబీఎంపీ అధికారులు కర్ణాటక హైకోర్టులో ఎలాంటి వివరణ ఇస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications