Hijab Row: హైకోర్టులో వాడివేడిగా వాదనలు, కాలేజ్ కమిటీలకు ఆ హక్కులేదు, పిటిషనర్, రేపటికి !
బెంగళూరు: హిజాబ్ దరించే విషయంలో ముస్లీం అమ్మాయిలు వేసిన పిటిషన్ విచారణ హైకోర్టులో వాడివేడిగా జరిగింది. హిజాబ్ దరించి కాలేజ్ లకు వెలుతున్న అమ్మాయిలను కావాలనే అడ్డుకున్నారని, కాలేజ్ అభివృద్ది కమిటీలకు, కాలేజ్ ల్లో ఏర్పాటు చేసిన సలహా కమిటీలకు లేదని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా యూనిఫామ్ రంగుల్లో ఉన్న హిజాబ్ లు వేసుకుని చదువు కోవడానికి అవకాశం ఉందని అమ్మాయిల తరుపు న్యాయవాది వాదించారు. ఇక్కడ (కర్ణాటక)లో ముస్లీం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసుకుంటున్న యూనీఫామ్ రంగులోనే హిజాబ్ లు దరిస్తామని మనవి చేస్తున్నారని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కొందరు కావాలనే కాలేజ్ అభివృద్ది కమిటీ, సలహా సమితి కమిటీ ముసుగులో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు దరించకుండా అడ్డుకుంటున్నారని అమ్మాయిల తరుపు న్యాయవాది వాదించారు. ఇస్లాం ఆచారాలను ముస్లీం అమ్మాయిలు పాటిస్తున్నారని అమ్మాయిల న్యాయవాది వాదించారు. అయితే ఇస్లాంలో ఉన్న పద్దతుల అన్నీ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు పాటిస్తున్నారా ? అని హైకోర్టు ప్రశ్నించడంతో దానికి అమ్మాయిల తరుపు న్యాయవాది అన్నీ పాటిస్తున్నారా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేమని చెప్పడం కొసమెరుపు. వాదనలు విన్న హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి విద్యాశాఖా మంత్రితో పాటు విద్యాశాఖా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

హిజాబ్ VS కాషాయం కండువాలు
స్కూల్స్, కాలేజ్ ల్లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు దరించకూడదని ఉడిపిలో మొదలైన గొడవ వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. హిజాబ్ లు వేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలను ఉడిపిలో ప్రిన్సిపాల్ అడ్డుకోవడం, అదే సమయంలో తాము కాషాయం కండువాలు వేసుకుని వస్తామని హిందూ మతానికి చెందిన అమ్మాయిలు, అబ్బాలు డిమాండ్ చెయ్యడంతో అక్కడ వ్యవహారం ముదిరిపోయింది.

హైకోర్టు ఆదేశాలు
హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకుని ఎవ్వరూ కూడా విద్యాసంస్థల్లో అడుగు పెట్టకూడదని ఇటీవల మద్యంతర ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది.

సలహా కమిటీలకు ఆ హక్కు లేదు
సోమవారం కర్ణాటక హైకోర్టులో హిజాబ్ దరించే విషయంలో వాదనలు జరిగాయి. హిజాబ్ దరించే విషయంలో ముస్లీం అమ్మాయిలు వేసిన పిటిషన్ విచారణ హైకోర్టులో వాడివేడిగా జరిగింది. హిజాబ్ దరించి కాలేజ్ లకు వెలుతున్న అమ్మాయిలను కావాలనే అడ్డుకున్నారని, కాలేజ్ అభివృద్ది కమిటీలకు, కాలేజ్ ల్లో ఏర్పాటు చేసిన సలహా కమిటీలకు లేదని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ కోర్టులో వాదించారు.

హిజాబ్ వేసుకోవడానికి అవకాశం ఉంది
కేంద్రీయ విద్యాలయాల్లో కూడా యూనిఫామ్ రంగుల్లో ఉన్న హిజాబ్ లు వేసుకుని చదువు కోవడానికి అవకాశం ఉందని అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు. ఇక్కడ (కర్ణాటక)లో ముస్లీం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసుకుంటున్న యూనీఫామ్ రంగులోనే హిజాబ్ లు దరిస్తామని మనవి చేస్తున్నారని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ హైకోర్టులో వాదించారు.

ఇస్లాం మతం ఆచారం ప్రకారమే పాటిస్తున్నారు
కొందరు కావాలనే కాలేజ్ అభివృద్ది కమిటీ, సలహా సమితి కమిటీ ముసుగులో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు దరించకుండా అడ్డుకుంటున్నారని అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు. ఇస్లాం ఆచారాలను ముస్లీం అమ్మాయిలు పాటిస్తున్నారని అమ్మాయిల న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు.

విచారణ రేపటికి వాయిదా
అయితే ఇస్లాంలో ఉన్న పద్దతుల అన్నీ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు పాటిస్తున్నారా ? అని హైకోర్టు ప్రశ్నించడంతో దానికి అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ అన్నీ పాటిస్తున్నారా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేమని చెప్పడం కొసమెరుపు. వాదనలు విన్న హైకోర్టు విచారణ రేపటికి (మంగళవారం మద్యాహ్నం) వాయిదా వేసింది. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ విద్యాశాఖా మంత్రి నాగేష్ తో పాటు విద్యాశాఖా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హిజాబ్ వివాదంపై అపలు అంశాలు ఆరా తీస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications