ఎస్ఐకి నో బెయిల్, భార్య హత్య కేసులో హైకోర్టు ఆర్డర్, లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో!
బెంగళూరులోని బేగూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. రమేష్ అరెస్ట్ భయంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. భార్య హత్య కేసులో ప్రాథమిక ఆధారాలు దొరికాయని, బెయిల్ మంజూరు చేయలేమని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బేగూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మహ్మద్ నవాజ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాదనలు విన్న కోర్టు ఘటన జరిగిన ఇంట్లోనే ఎస్ఐ రమేష్ భార్య శిల్పా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేసింది.

ఛార్జిషీట్‌లోని ఆధారాల ప్రకారం నిందితుడు రమేష్ అతని భార్య శిల్పాను శారీరకంగా, మానసిక హింసకు గురిచేస్తున్నాడని నిర్ధారించింది. ఎస్ఐ రమేష్ తన భార్య శిల్పా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం శిల్పా మృతదేహంపై కొన్ని గాయాలు, అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు వెలుగు చూసింది. అలాగే శిల్పా రాసిన ఎలాంటి డెత్ నోట్ చిక్కలేదు.
ఎస్ఐ రమేష్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. చిక్కబళ్లాపూర్ తాలూకాకు చెందిన రమేష్, శిల్పా బీఈ చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. శిల్పా షెడ్యూల్డ్ కులానికి చెందినందున రమేష్ కుటుంబ సభ్యులు వివాహాన్ని వ్యతిరేకించినప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
చింతామణి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంల రమేష్, శిల్పా వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత శిల్పాపై ఆమె భర్త రమేష్ శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా ఇదే ఏడాది జూన్ 2వ తేదీన శిల్పాకు ఆమె తండ్రి వెంకటరాయప్ప ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా శిల్పా ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. మరుసటి రోజు ఉదయం తన కుమార్తె శిల్పాను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఇంటి యజమాని ద్వారా అతనికి సమాచారం అందించారు. వెంకటరాయప్ప ఆస్పత్రికి వెళ్లేసరికి శిల్పా మృతి చెందింది. శిల్పాను ఆమె భర్త ఎస్ఐ రమేష్ హత్య చేశాడని వెంకటరాయప్ప కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications