ఎంపీ సెక్స్ స్యాండల్ కేసు, హొం మంత్రి క్లారిటీ, విదేశాల నుంచి ఎంపీ వచ్చాడా ? లేదా ?
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ కేసు కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్ సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ జరిగిన రోజే జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో వైరల్ అయ్యాయి.
అదే రోజు రాత్రి ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి ప్రజ్వల్ రేవణ్ణ కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి తిరిగి వచ్చిన విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ గురించి సిట్ అధికారులకు సమాచారం ఉంటుందని, విచారణ జరిగే సమయంలో ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో అనే విషయంలో వారికి హక్కు ఉందని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు.

కొన్ని సందర్బాల్లో, కొన్ని కేసుల్లో ఇంటెలిజెన్స్ అధికారులకు ముందుగానే సమాచారం వస్తుందని, అవి ఎలాంటి కేసులు అయినా అలాగే ఉంటుందని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో ప్రతినిత్యం టచ్ లోనే ఉంటానని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడిన విషయంలో కొత్త విషయాలు ఏమీ లేవని, ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన్ను మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం కలుస్తూనే ఉంటారని హోం మంత్రి పరమేశ్వర్ చెప్పారు.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం, ఆయన కేసు గురించి కర్ణాటకతో పాటు దేశం మొత్తం ప్రతిరోజు హాట్ టాపిక్ అవుతోంది. ఇదే విషయంలో జేడీఎస్ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో సమాధానం చెప్పలేక బీజేపీ నాయకులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజ్వల్ రేవణ్ణను భారతదేశానికి రప్పించాలని సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications