Karnataka Horror: దారుణం.. అర్ధరాత్రి ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం

Karnataka Horror: కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం హంపి నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక విదేశీ పర్యాటకురాలితో సహా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి.. వారితో పాటు వచ్చిన ముగ్గురు వ్యక్తులను కొట్టి నీటిలో పడేశారు. ఈ యువకులలో ఒకరి మృతదేహాన్ని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.00 నుంచి 11.30 గంటల మధ్య సనపూర్ సరస్సు సమీపంలో ఈ ఘటన జరిగింది. నిందితులు 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలిపై, 29 ఏళ్ల హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేశారు.

ఒడిశాకు చెందిన పర్యాటకుడి మృతదేహం సరస్సులో లభ్యం
ఘటన జరిగిన సమయంలో బాధిత మహిళలతో పాటు ఉన్న ఒడిశాకు చెందిన ఒక పర్యాటకుడు కనిపించకుండా పోయాడు. దాడి చేసిన వారు అతన్ని తుంగభద్ర కాలువలోకి విసిరేశారు. శనివారం ఉదయం అతని మృతదేహం సరస్సులో లభ్యమైంది. అదే సమయంలో అమెరికా, మహారాష్ట్ర నుంచి వచ్చిన మరో ఇద్దరు పర్యాటకులు ఈ ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనను దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మృతుడి మృతదేహాన్ని కనుగొన్న తర్వాత హత్య అభియోగాలను పోలీసులు జోడించారు.

Israeli Tourist Home Stay Operator Physically Harassed
పెట్రోల్ స్టేషన్ గురించి అడిగి.. దాడి చేసిన దుండగులు
ఎఫ్ఐఆర్ ప్రకారం.. నలుగురు పర్యాటకులు, ఒక హోమ్ స్టే యజమాని రాత్రి భోజనం తర్వాత సనపూర్ సరస్సు సమీపంలో తుంగభద్ర ఎడమ కాలువ వెంబడి నక్షత్రాలను చూడడానికి వెళ్లారు. అప్పుడు ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై అక్కడికి వచ్చి పెట్రోల్ పంపు గురించి అడగడం ప్రారంభించారు. దగ్గరలో పెట్రోల్ స్టేషన్ లేదని హోమ్ స్టే యజమాని చెప్పగా.. దుండగులు వారి నుంచి డబ్బును డిమాండ్ చేశారు. పర్యాటకులు వారికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో నిందితులు వారిపై దుర్భాశలాడడం, దాడి చేయడం ప్రారంభించారు. అనంతరం నిందితులు ముగ్గురు పర్యాటకులను(పురుషులు) బలవంతంగా కాలువలోకి నెట్టారు. అందులో ఇద్దరు బయటకు రాగా.. ఒకరు గల్లంతయ్యారు. ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ లు బయటకు రాగా.. ఒడిశాకు చెందిన బిబాష్ మృతదేహం ఉదయం దొరికింది.

నిందితుల కోసం గాలింపు..
బాధితురాలి ప్రకారం.. ఆమె స్నేహితులు కాలువ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుండగా.. దాడి చేసిన నిందితులలో ఇద్దరు ఆమెపై, ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఉదయం నుంచి డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ అధికారులు తప్పిపోయిన పర్యాటకుడి కోసం వెతుకుతుండగా.. శనివారం ఉదయం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు ఇప్పుడు నిందితుల కోసం వేట ప్రారంభించారు. వీలైనంత త్వరగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

నిందితులు మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని కొప్పల్ ఎస్పీ అరసిద్ధి వెల్లడించారు. ఇద్దరు మహిళలపై దాడి చేయడమే కాకుండా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ప్రస్తుతం మహిళలు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. నిందితులపై అత్యాచారం, దోపిడీ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఫిర్యాదు అందగానే వెంటనే చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+