ఇంటర్ పాస్ కాకుండానే ఐటీ శాఖా మంత్రి అయిపోయారా ?, మోదీ లాగా చెయ్యం !
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో భారతదేశం మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. భారతదేశానికి చెందిన అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో మంచిమంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఇక భారతదేశంలో ఐటీ హబ్ గా బెంగళూరు సిటీ పేరుప్రఖ్యాతలు సంపాధించుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చెయ్యాలంటే ఏం చదవాలో మనకు బాగా తెలుసు. కనీసం సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం రావాలన్నా చాలా కష్టం అని అందరికి తెలుసు.
కర్ణాటకలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు ఏం చదివారు ?, ఆయన విద్యార్హతలు ఏమిటి ?, ఏం చదివితే ఆయనకు ఐటీ శాఖా మంత్రి పదవివి వచ్చింది అంటూ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఐటీ, బీటీ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే విద్యార్హతపై ఇప్పుడు ఆ రాష్ట్రంలో భారీగా చర్చ జరుగుతోంది. పాఠ్య పుస్తకాల ప్రణాళిక మార్పుపై మాట్లాడిన మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.

చక్రవర్తి సూలిబెలేకు ఉన్న విద్యార్హతలు, ఆయనకు ఉన్న హక్కు, విద్యార్హతలు ఏమిటని, ఆయన రాసిన పాఠాన్ని మన పిల్లలు చదవకూడదని, ఆయన పాఠాలన్ని పుస్తకాల్లో తొలగిస్తామని కర్ణాటక ఐటీ శాఖ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ప్రియాంక ఖార్గే చెప్పడంతో అసలు వివాదం మొదలైంది. చక్రవర్తి సూలిబెలే విద్యార్హతపై మంత్రి ప్రియాంక్ ఖార్గే మాట్లాడటంపై బీజేపీ స్పందించింది.
ప్రియాంక్ ఖర్గే కేవలం పీయూసీ మొదటి సంవత్సరం (ఇంటర్) మాత్రమే చదివారని ఆరోపించారు. పీయూసీ మాత్రమే చదివిన ప్రియాంక్ ఖర్గే ఐటీ బీటీ మంత్రి ఎలా అయ్యారని పలువురు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ చదివిన ప్రియాంక ఖార్గేని ఏకంగా ఐటీ శాఖా మంత్రిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ విద్యావంతులైన నిపుణులు, టెక్కీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ నాయకుల విమర్శలపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విద్యార్హత విషయంలో తానే ఏమీ దాచిపెట్టడం లేదని, నా విద్యార్హత సమాచారం కావాలంటే ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ద్వారా తెలుసుకోవచ్చని, విద్యార్హత తెలుసుకునేందుకు ముందుకు వచ్చిన వారిపై ప్రధాని నరేంద్ర మోదీలాగా మేము కేసులు నమోదు చెయ్యమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖార్గే బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు.

కర్ణాటక ఐటీ, బీటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ప్రియాంక ఖర్గే అసలు ఏం చదివారు, అర్హతలు ఏంటి అనే విషయంపై చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంగా ప్రియాంక ఖార్గే తన విద్యార్హతల వివరాలను వెల్లడించారు. ఎన్నికల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రియాంక ఖర్గే మొదటి పీయూసీ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదివారని వెలుగు చూసింది.
తాను 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యానని, 1996లో మల్లేశ్వరంలోని ఎంఈఎస్ కళాశాలలో ప్రథమ పీయూసీ చదివానని మంత్రి ప్రియాంక ఖార్గే ఎన్నికల ముందు ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత 1999లో కంప్యూటర్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ పొందారు. దీనిపై మాట్లాడిన ప్రియాంక్ ఖర్గే నేను నేషనల్ లా స్కూల్ లో చదివి పాసయ్యాను,

కావాలంటే నేషనల్ లా స్కూల్ కు వెళ్లి వివరాలు సేకరించుకోవాలని బీజేపీ నాయకులకు సూచించారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ప్రియాంక ఖార్గేకి సంబంధిన నేషనల్ కాలేజ్ లో చదివిన వివరాలు, సమాచారానికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు..
కర్ణాటక ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే విద్యార్హతపై హేళన చేస్తున్న బీజేపీ నేతలు, బీజేపీ మద్దతుదారులకు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా సమాధానమిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉండేందుకు తన కుమారుడు జయ్ షాకు ఉన్న అర్హ ఏమిటని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల విద్యార్మతలు వివాదం ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య చిచ్చు రేపుతోంది. బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ నగరం తెరమీదకు వచ్చిన సమయంలో కర్ణాటక ఐటీ శాఖా మంత్రి విద్యార్హ విషయంలో కూడా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications