మెట్రో రైలులో షికారుకు వెళ్లిన ఐటీ మంత్రి, బీజేపీకి పనిపాట లేకుండా ఖాళీగా ఉంది, ప్రియాంక్!
బెంగళూరు: కర్ణాటక ఐటీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే గురువారం బెంగళూరు మెట్రోలో (Bengaluru Metro train) విధానసౌధ నుంచి వైట్‌ఫీల్డ్ వరకు ప్రయాణించారు. ఈ రోజు, నేను నా పని ప్రయాణానికి ఊదారంగు మార్గాన్ని ఎంచుకున్నాను, ఇది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని మంత్రి ప్రియాంక్ ఖార్గే ట్విట్టర్ ( X) ట్వీట్ చేశారు. విదానసౌధ నుంచి వైట్‌ఫీల్డ్‌కి 30 నుంచి సుమారు 40 నిమిషాల ప్రయాణం చేశారు.
బెంగళూరు మెట్రోరైలులో (Bengaluru Metro train) సంచరించి తరువాత తాను క్యాబినెట్ మీటింగ్ కోసం కార్యాలయానికి వచ్చానని మంత్రి ప్రియాంక్ ఖార్గే చెప్పారు. మెట్రోలో సాటి ప్రయాణికులతో కొన్ని అద్భుతమైన సంభాషణలు జరిగాయని, గత వారం వైట్ ఫీల్డ్ కు రైలు మార్గం ప్రారంభించినప్పటి నుండి కేఆర్ పురం (KR Puram) పురం నుండి వైట్‌ఫీల్డ్ జంక్షన్ వరకు మెట్రో రైడర్‌షిప్ 100% పెరిగిందని మంత్రి ప్రియాంక్ ఖార్గే చెప్పారు.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి ప్రియాంక్ ఖార్గే ఇప్పుడు మెట్రోలో ప్రయాణించి మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం బెంగళూరులో (Bengaluru) మంత్రి ప్రియాంక్ ఖార్గే మీడియాతో మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన బీజేపీ (BJP)ప్రజలచేత చీదరించబడిందని, కర్ణాటక బీజేపీ నాయకులకు ఢిల్లీలో గౌరవం దక్కక, కర్ణాటకలో (Karnataka) అధికార పీఠం దక్కకపోవటంతో బీజేపీ నాయకులకుకి కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆరోపించారు.
కేంద్రం నుంచి 540 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఏ బకాయిలను రాష్ట్రానికి తీసుకురావడంలో భాజపా ఎంపీల కనీస బాధ్యతలేకుండాపోయిందని మంత్రి (Minister) ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడి మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా బీజేపీకి (bjp)ప్రతిపక్ష నేత స్థానానికి ఒక్క నాయకుడు కూడా దొరకడం లేదని, బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు కూడా నెలల తరబడి లేకపోవడంతో పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయని కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.












Click it and Unblock the Notifications